12.1 అంగుళాల 3K డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR MagicPad 4 ట్యాబ్ లాంచ్.. ధర ఎంతంటే.?
- చైనా మార్కెట్లో హానర్ మ్యాజిక్‌ప్యాడ్ 4 ట్యాబ్ లాంచ్
- 12.1 అంగుళాల 3K ఎల్సీడీ డిస్ప్లే, 165Hz వరకు హై రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్
- ఆరు స్పీకర్ల స్టీరియో సిస్టమ్, 3D స్పేషియల్ ఆడియో
- స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 4 ప్రాసెసర్, అడ్రినో 825 GPU
- 10,100mAh భారీ బ్యాటరీ, 66W ఫాస్ట్ ఛార్జింగ్
- 13MP రియర్, 9MP ఫ్రంట్ కెమెరాలు, వై-ఫై 7, బ్లూటూత్ 6.0, యూఎస్బీ టైప్-C కనెక్టివిటీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
HONOR MagicPad 4: హానర్ చైనా మార్కెట్లో కొత్త MagicPad 4 ట్యాబ్లెట్‌ను విడుదల చేసింది. ఈ మోడల్ గ్లోబల్ మార్కెట్లో గతంలో విడుదలైన MagicPad 4తో పోలిస్తే కొన్ని ముఖ్యమైన మార్పులతో వచ్చింది. ముఖ్యంగా OLEDకు బదులుగా LCD డిస్ప్లే, కొత్త ప్రాసెసర్‌ను ఇందులో అందించారు. హై-రిఫ్రెష్-రేట్ స్క్రీన్, భారీ బ్యాటరీ, శక్తివంతమైన చిప్సెట్తో ప్రొడక్టివిటీ, మల్టీమీడియా అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ ట్యాబ్‌ను రూపొందించారు.
12.1 అంగుళాల 3K డిస్ప్లే
హానర్ మ్యాజిక్ ప్యాడ్ 4లో 12.1 అంగుళాల LCD స్క్రీన్ ఉంది. ఇది 3000 × 1872 పిక్సెల్స్ 3K రిజల్యూషన్, 292ppiతో వస్తుంది. 60Hz, 90Hz, 120Hz, 144Hz, 165Hz వరకు రిఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేస్తుంది. హానర్ Oasis ఐ ప్రొటెక్షన్ టెక్నాలజీతో వచ్చిన ఈ డిస్ప్లే గరిష్ఠంగా 700 నిట్స్ బ్రైట్నెస్ను అందిస్తుంది. IMAX Enhanced, HDR Vivid సర్టిఫికేషన్లు కూడా ఉన్నాయి.
Also Read
- Truecaller Scam Checker: ఆన్లైన్ స్కామ్‌లకు చెక్ పెట్టేందుకు Truecaller కొత్త ఫీచర్.. నంబర్, లింక్, మెసేజ్ అన్నీ ఒకేచోట చెక్..
- 100W ఛార్జింగ్, 200MP ARRI కెమెరా, 8,800mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ HONOR Magic9 Pro Max లాంచ్.!
- ARRI టెక్నాలజీ, 200MP+200MP కెమెరాలు, 8,000mAh భారీ బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్లతో HONOR Magic 9 లాంచ్.!
- Honor Smart Phone: 200MP కెమెరా, 11,000mAh బ్యాటరీ.. మార్కెట్లోకి కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్..
ఆడియో కోసం ఆరు స్పీకర్ల స్టీరియో సిస్టమ్‌ను అందించారు. 3D స్పేషియల్ ఆడియోకు సపోర్ట్ ఉండటంతో సినిమాలు, వీడియోలు చూడటంతో పాటు ఆన్లైన్ మీటింగ్స్‌కు కూడా ఉపయోగపడుతుంది.
స్నాప్ డ్రాగన్ 8s జెన్ 4 ప్రాసెసర్
పనితీరు కోసం ఇందులో 4nm Snapdragon 8s Gen 4 మొబైల్ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించారు. గ్రాఫిక్స్ కోసం Adreno 825 GPU ఉంది. భారీ పనుల సమయంలో పనితీరు తగ్గకుండా ఉండేందుకు 3D థర్మల్ మేనేజ్మెంట్ సిస్టమ్‌ను అందించారు. ఇందులో 37,000mm² కంటే ఎక్కువ గ్రాఫైట్ డిసిపేషన్ ఏరియా ఉంది. గత తరం కంటే గ్రాఫైట్ హీట్ డిసిపేషన్ సామర్థ్యం 11.7 % మెరుగుపడినట్లు హానర్ తెలిపింది.
10,100mAh భారీ బ్యాటరీ
మ్యాజిక్ ప్యాడ్ 4లో 10,100mAh బ్యాటరీ ఉంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 70 రోజుల వరకు స్టాండ్‌బై సమయం అందించగలదని కంపెనీ పేర్కొంది. భారీ బ్యాటరీ ఉన్నప్పటికీ ట్యాబ్ మందం కేవలం 6.29mm మాత్రమే. దీని బరువు 537 గ్రాములు. 66W హానర్ సూపర్ ఛార్జ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఉంటుంది.
సాఫ్ట్వేర్ పరంగా మ్యాజిక్ ప్యాడ్ 4లో MagicOS 10, ఆండ్రాయిడ్ 16 ఆధారంగా పనిచేస్తుంది. హానర్ బోర్డర్ లెస్ నోట్స్, హానర్ నాలెడ్జి వర్క్ షాప్ వంటి ప్రొడక్టివిటీ ఫీచర్లను ఇందులో అప్డేట్ చేశారు. అలాగే ఆండ్రాయిడ్ PC అప్లికేషన్ వర్క్‌ఫ్లోలకు సపోర్ట్ అందించారు.
ఫైళ్ల షేర్
ఈ ట్యాబ్‌లో ప్రత్యేకంగా క్రాస్-బ్రాండ్ ఫైల్ షేరింగ్ ఫీచర్‌ను అందించారు. దీని ద్వారా మ్యాజిక్ ప్యాడ్ 4 నుంచి ఇతర బ్రాండ్ డివైజ్‌లకు ఫైళ్లు, ఫొటోలు, వీడియోలను నేరుగా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ముఖ్యంగా ఐఫోన్ వంటి iOS డివైజ్లతో కూడా ఫైల్ షేరింగ్ చేయగలిగేలా ఇంటర్ ఆపరబిలిటీని అందించారు.
కెమెరాలు, కనెక్టివిటీ
హానర్ మ్యాజిక్ ప్యాడ్ 4 వెనుక భాగంలో f/2.0 అపెర్చర్‌తో 13MP ఆటోఫోకస్ కెమెరా ఉంది. ముందు భాగంలో f/2.2 అపెర్చర్‌తో 9MP ఫిక్స్డ్-ఫోకస్ కెమెరా అందించారు. కనెక్టివిటీ కోసం డ్యూయల్-బ్యాండ్ Wi-Fi 7, బ్లూటూత్ 6.0, USB టైపు-C పోర్ట్ ఉన్నాయి. మూడు మైక్రోఫోన్లను కూడా అందించారు.
ధర
ప్రస్తుతం చైనా మార్కెట్లో HONOR MagicPad 4 అమ్మకానికి అందుబాటులో ఉంది. రెండు మెమరీ వేరియంట్లలో దీన్ని విడుదల చేశారు.
* 8GB + 256GB: 3,299 యువాన్ (సుమారు రూ.47,175)
* 12GB + 256GB: 3,699 యువాన్ (సుమారు రూ.52,895)
భారత్‌లో ఈ ట్యాబ్లెట్ ఎప్పుడు విడుదల అవుతుంది, ఏ ధరకు లభిస్తుంది అనే వివరాలను కంపెనీ వెల్లడించలేదు.
తాజావార్తలు
-
12.1 అంగుళాల 3K డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR MagicPad 4 ట్యాబ్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
October 2026 Rule Changes: అక్టోబర్‌లో మారనున్న కీలక రూల్స్.. బ్యాంక్, LPG, UPI నుంచి ITR వరకు పూర్తి లిస్ట్ ఇదే!
-
Bloody Romeo : నాని సరసన నాజూకు బ్యూటీ..
-
Divya Mittal: ఐఏఎస్‌కు గుడ్‌బై.. రాజకీయాల్లోకి ఎంట్రీ..
-
Truecaller Scam Checker: ఆన్లైన్ స్కామ్‌లకు చెక్ పెట్టేందుకు Truecaller కొత్త ఫీచర్.. నంబర్, లింక్, మెసేజ్ అన్నీ ఒకేచోట చెక్..
ట్రెండింగ్
-
Veg Keema: నాన్‌వెజ్ కీమాను మర్చిపోయేలా.. నోరూరించే ధాబా స్టైల్ ‘వెజ్ కీమా’.. సులువుగా చేసేయండి ఇంట్లో.!
-
Bats Theft: నా బ్యాట్లు దొబ్బేశారు.. టీమిండియా ప్లేయర్ ఆవేదన.!
-
100W ఛార్జింగ్, 200MP ARRI కెమెరా, 8,800mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ HONOR Magic9 Pro Max లాంచ్.!
-
ARRI టెక్నాలజీ, 200MP+200MP కెమెరాలు, 8,000mAh భారీ బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్లతో HONOR Magic 9 లాంచ్.!
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!