Ramayana Part 1 Title: రణ్‌బీర్ కపూర్ బర్త్‌డే సర్ప్రైజ్.. ‘రామాయణ’ పార్ట్ 1 టైటిల్ ఇదే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ramayana Part 1 Title is Rise of a Legend: బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘రామాయణ’. దర్శకుడు నితీశ్ తివారీ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా.. నమిత్ మల్హోత్రా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. భారతీయ ఇతిహాసం రామాయణం ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాలో రణ్‌బీర్ కపూర్ రాముడిగా, లేడీ పవర్ స్టార్ సాయిపల్లవి సీతగా, కన్నడ స్టార్ యశ్ రావణుడిగా కనిపించనున్నారు.
రామాయణను రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. ఇందులో తొలి భాగాన్ని ఈ దీపావళికి విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇప్పటివరకు ఈ చిత్రాన్ని ‘రామాయణ: పార్ట్-1’గా పిలుస్తుండగా.. తాజాగా మేకర్స్ మొదటి భాగానికి అధికారిక టైటిల్‌ను ప్రకటించారు. రణ్‌బీర్ కపూర్ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. తొలి భాగానికి ‘రామాయణ: రైజ్ ఆఫ్ ఏ లెజెండ్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ‘మానవాళి చరిత్రలో అత్యుత్తమ కథకు ప్రాణం పోస్తున్నాం’ అనే క్యాప్షన్‌తో ఈ పోస్టర్‌ను సోషల్ మీడియాలో పంచుకున్నారు.
Also Read
తాజాగా విడుదలైన పోస్టర్లో రాముడిగా రణ్‌బీర్ కపూర్, రావణుడిగా యశ్ పాత్రలను హైలైట్ చేశారు. ఇద్దరి పాత్రలను ప్రతిబింబించేలా రూపొందించిన పోస్టర్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది. భారీ విజువల్స్, గ్రాండ్ మేకింగ్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు పోస్టర్ చూస్తే ఇట్టే అర్థమవుతోంది. రైజ్ ఆఫ్ ఏ లెజెండ్ అనే టైటిల్‌తో తొలి భాగంపై అధికారిక క్లారిటీ రావడంతో అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది. ఈ దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానున్న రామాయణ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
తాజావార్తలు
-
Ramayana Part 1 Title: రణ్‌బీర్ కపూర్ బర్త్‌డే సర్ప్రైజ్.. ‘రామాయణ’ పార్ట్ 1 టైటిల్ ఇదే!
-
Gold Silver Price Today: పడిపోతున్న పసిడి ధర.. వరుసగా రెండో రోజూ భారీగా డౌన్
-
Share Nani Tag: ఒక్క సినిమాకే సరిపోయింది.. మళ్లీ ‘నేచురల్ స్టార్’గానే నాని!
-
12.1 అంగుళాల 3K డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR MagicPad 4 ట్యాబ్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
October 2026 Rule Changes: అక్టోబర్‌లో మారనున్న కీలక రూల్స్.. బ్యాంక్, LPG, UPI నుంచి ITR వరకు పూర్తి లిస్ట్ ఇదే!
ట్రెండింగ్
-
Veg Keema: నాన్‌వెజ్ కీమాను మర్చిపోయేలా.. నోరూరించే ధాబా స్టైల్ ‘వెజ్ కీమా’.. సులువుగా చేసేయండి ఇంట్లో.!
-
Bats Theft: నా బ్యాట్లు దొబ్బేశారు.. టీమిండియా ప్లేయర్ ఆవేదన.!
-
100W ఛార్జింగ్, 200MP ARRI కెమెరా, 8,800mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ HONOR Magic9 Pro Max లాంచ్.!
-
ARRI టెక్నాలజీ, 200MP+200MP కెమెరాలు, 8,000mAh భారీ బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్లతో HONOR Magic 9 లాంచ్.!
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!