Gold Silver Price Today: పడిపోతున్న పసిడి ధర.. వరుసగా రెండో రోజూ భారీగా డౌన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gold Silver Price Today: దేశీయ మార్కెట్లో మంగళవారం, సెప్టెంబర్ 29న బంగారం, వెండి ధరల్లో భారీ కదలిక కనిపించింది. ప్రారంభ ట్రేడింగ్‌లో దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్లో బంగారం ధరలు గణనీయంగా తగ్గాయి. అంతర్జాతీయంగా ఇరాన్-అమెరికా మధ్య హార్ముజ్ జలసంధిపై కొనసాగుతున్న ప్రతిష్టంభన, పెరుగుతున్న ఇంధన ధరలు, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై అంచనాలు బులియన్ మార్కెట్‌పై ప్రభావం చూపుతున్నాయి. ఉదయం 9 గంటల సమయంలో MCX గోల్డ్ అక్టోబర్ 5 ఫ్యూచర్స్ 10 గ్రాములకు రూ.1,46,513 వద్ద ఉండగా, MCX సిల్వర్ డిసెంబర్ 4 కాంట్రాక్ట్ కిలోకు రూ.2,27,390 వద్ద ట్రేడైంది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ఔన్స్‌కు సుమారు 4,125 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.
రిటైల్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారాన్ని అత్యంత స్వచ్ఛమైన బంగారంగా పరిగణిస్తారు. నగల తయారీకి సాధారణంగా 22 క్యారెట్ల బంగారాన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. సెప్టెంబర్ 29న ప్రధాన నగరాల్లో నమోదైన రిటైల్ ధరలు ఇలా ఉన్నాయి.
Also Read
- Gold and Silver Prices Fall: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు..
- Gold and Silver Price Today: బంగారం, వెండి ధరలకు మళ్లీ రెక్కలు.. రెండో రోజూ భారీ పెరుగుదల
- Gold and Silver Prices Today: గుడ్ న్యూస్.. బంగారం, వెండి ధరలు భారీగా పతనం..
- Right Age to Buy Your First Home: ఏ వయసులో ఇల్లు కొనాలి? తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే..!
ముంబైలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,47,250గా.. 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ.1,34,979గా ఉంది.. ఇక, కిలో వెండి ధర రూ.2,25,870కి చేరింది..
న్యూఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,46,990గా.. 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ.1,34,741కి తగ్గింది.. కిలో వెండి ధర రూ.2,25,490
బెంగళూరులో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,47,360.. 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.1,35,080.. కిలో వెండి ధర రూ.2,26,050గా ఉంది..
కోల్‌కతాలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,47,050.. 22 క్యారెట్ల పసిడి ధర రూ.1,36,015.. కిలో వెండి ధర రూ.2,27,850గా ఉంది..
హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,47,520.. 22 క్యారెట్ల పసిడి ధర రూ.1,35,227.. కిలో వెండి ధర రూ.2,26,190గా ఉంది..
చెన్నైలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,47,710.. 22 క్యారెట్ల పసిడి ధర రూ.1,35,401.. కిలో వెండి ధర రూ.2,26,490గా ఉంది..
హైదరాబాద్ బులియన్ మార్కెట్లో కూడా భారీగా తగ్గింది.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,370 తగ్గి.. రూ.1,48,800కి దిగివచ్చింది.. 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,250 తగ్గి.. రూ.1,36,400కి పరిమితమైంది.. వెండి ధర కూడా స్వల్పంగా తగ్గింది.. కిలో వెండి ధర రూ.100 తగ్గి రూ.2,44,900కి దిగివచ్చింది.. అయితే, ఆభరణాల కొనుగోలు సమయంలో పైన పేర్కొన్న ధరలకు అదనంగా మేకింగ్ ఛార్జీలు, పన్నులు, GST వంటివి జోడించే అవకాశం ఉంటుంది. అందువల్ల జువెల్లరీ షాపులో చెల్లించే తుది ధర నగరం, వ్యాపారి, ఆభరణం రకం ఆధారంగా మారవచ్చు..
తాజావార్తలు
-
Gold Silver Price Today: పడిపోతున్న పసిడి ధర.. వరుసగా రెండో రోజూ భారీగా డౌన్
-
Share Nani Tag: ఒక్క సినిమాకే సరిపోయింది.. మళ్లీ ‘నేచురల్ స్టార్’గానే నాని!
-
12.1 అంగుళాల 3K డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR MagicPad 4 ట్యాబ్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
October 2026 Rule Changes: అక్టోబర్‌లో మారనున్న కీలక రూల్స్.. బ్యాంక్, LPG, UPI నుంచి ITR వరకు పూర్తి లిస్ట్ ఇదే!
-
Bloody Romeo : నాని సరసన నాజూకు బ్యూటీ..
ట్రెండింగ్
-
Veg Keema: నాన్‌వెజ్ కీమాను మర్చిపోయేలా.. నోరూరించే ధాబా స్టైల్ ‘వెజ్ కీమా’.. సులువుగా చేసేయండి ఇంట్లో.!
-
Bats Theft: నా బ్యాట్లు దొబ్బేశారు.. టీమిండియా ప్లేయర్ ఆవేదన.!
-
100W ఛార్జింగ్, 200MP ARRI కెమెరా, 8,800mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ HONOR Magic9 Pro Max లాంచ్.!
-
ARRI టెక్నాలజీ, 200MP+200MP కెమెరాలు, 8,000mAh భారీ బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్లతో HONOR Magic 9 లాంచ్.!
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!