విప్రజ్ నిగమ్... నిన్నటి వరకు చాలా తక్కువ మందికి ఈ పేరు తెలుసు. అయితే.. 2025 సీజన్ ప్రారంభంలో ఈ యువ ఆటగాడు తన అద్భుతమైన ప్రదర్శనతో ప్రతి క్రికెట్ ప్రేమికుడి నోట ఇతని పేరే మెదులుతుంది. లక్నో సూపర్ జెయింట్స్ (LSG)తో జరిగిన మ్యాచ్‌లో విప్రజ్ నిగమ్ తన తొలి మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన ప్రదర్శించి తన ప్రతిభను చాటాడు. విప్రజ్ తన తొలి మ్యాచ్‌లో ఆల్-రౌండ్ ప్రదర్శనతో మెప్పించాడు.