IndiGo: గతేడాది డిసెంబర్ నెలలో ఇండిగో విమానాల రద్దు సంక్షోభం తలెత్తింది. అయితే, దీనికి చర్యగా కేంద్రం ఇండిగోకు భారీ షాక్ ఇచ్చింది. రూ. 22 కోట్ల జరిమానా విధించింది. గతేడాది తలెత్తిన సంక్షోభం నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 3 నుంచి 5 వరకు దేశవ్యాప్తగా ఇండిగో విమానాల రద్దు కొనసాగింది. 2507 విమానాలు రద్దు కావడంతో పాటు 1852 విమానాలు ఆలస్యంగా నడిచాయి. దేశవ్యాప్తంగా వివిధ ఎయిర్‌పోర్టుల్లో 3 లక్షల మంది ప్రయాణికులు…