ఎటిఎం అంటే డబ్బులను బ్యాంకు అవసరం లేకుండా డ్రా చేసుకునేందుకు జారీ చేసిన కార్డు.. అయితే ఈ ఏటీఎం మెషిన్ బ్యాంకింగ్‌కు సంబంధించిన అనేక ఇతర పనులను చేస్తుందని మీరెప్పుడైన గమనించారా?.. ఏటీఎం మెషిన్ నేటి రోజుల్లో ఎంతగానో ఉపయోకరంగా ఉంది. మీ బ్యాంకింగ్‌కు సంబంధించిన అనేక పనులను సులభతరం చేసే ఇలాంటి అనేక ఫీచర్లు ఇందులో ఉన్నాయి. వీటిలో మీరు దాదాపు ప్రతి బ్యాంకు ఏటీఎంమెషీన్ తో కొన్ని పనులను కూడా చెయ్యొచ్చునని నిపుణులు అంటున్నారు…
క్రెడిట్ కార్డులపైనా బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్ అనే ఆప్షన్ ఉంటుంది. బ్యాలెన్స్ ట్రాన్స్ ఫర్ ఆప్షన్ ఎంటంటే.. ఒక కార్డులోని అవుట్ స్టాండింగ్ మొత్తాన్ని మరో కార్డుపైకి బదిలీ చేయడం అన్నమాట. ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరూ ఒకటి కంటే ఎక్కువ క్రెడిట్ కార్డులను ఉపయోగిస్తున్నారు.