Credit Card: డబ్బులు లేకపోయినా క్రెడిట్ కార్డు బిల్లు కట్టొచ్చు.. పోలా అదిరిపోలా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం క్రెడిట్ కార్డుల వాడకం సాధారణమైపోయింది. చాలా మంది తమ ఇంటి రెంట్, కరెంట్ బిల్లు చెల్లింపులు, షాపింగ్, రీఛార్జ్, సబ్‌స్క్రిప్షన్‌లు మొదలైన వాటి కోసం క్రెడిట్ కార్డ్‌లను ఎక్కువగా వాడుతున్నారు. అయితే, నిర్ణీత సమయంలో ఎలాంటి వడ్డీ లేకుండా కార్డులు వినియోగించుకునే ఛాన్స్ ఉండటంతో అందరూ వీటిని వినియోగిస్తున్నారు. పైగా మన పాకెట్ లోని డబ్బు ఆదా అవడానికి సహాయపడే పలు క్యాష్ బ్యాక్, డిస్కౌంట్ల వంటి ఆఫర్లు కూడా క్రెడిట్ కార్డులపై వస్తుండటంతో వీటిని తెగ వాడేస్తున్నారు.
Read Also: PM Modi: అమెరికా పర్యటన ఇరు దేశాల భాగస్వామ్యాన్ని మరింత పెంచుతుంది..
Also Read
- RBI Repo Rate Hike: హోమ్, కార్ లోన్లు ఉన్నవారికి బిగ్ షాక్.. రెపో రేటు పెంచిన ఆర్బీఐ.. సామాన్యులపై తీవ్ర భారం..
- RBI: ఆర్బీఐ షాక్ ఇవ్వబోతుందా? రేపు వడ్డీ రేట్లు పెరగబోతున్నాయా? నిపుణుల అంచనా ఇదే!
- Cash Withdrawal Surges: ఏటీఎంల నుంచి నగదు ఉపసంహరణలో కొత్త రికార్డు.. ఏకంగా రూ.2.24 లక్షల కోట్లు డ్రా!
- IndiGo Flight Fare Hike: ఇండిగో విమాన ప్రయాణికులకు షాక్.. నేటి నుంచి రూ.350 వరకు అదనపు భారం, కొత్త ఛార్జీలు ఇవే!
కొంతమంది ఒకటి కంటే ఎక్కువ క్రెడిట్ కార్డులు వాడుతున్నారు. అయితే బిల్లు జనరేట్ అయిన తర్వాత నిర్ణీత గడువులోపు కార్డు బిల్లు కట్టకపోతే మాత్రం అదొక పీడకలగా మారిపోయే ఛాన్స్ ఉంది. ఎందుకంటే క్రెడిట్ కార్డు బిల్లు సకాలంలో చెల్లించకపోతే బ్యాంకర్లు భారీగా వడ్డీ వసూలు చేస్తారు. అందుకు తగిన నగదు మీ వద్ద ఉంటే ఇబ్బంది లేదు.. ఒకవేళ టైంకి డబ్బులు లేకపోతేనే అసలు ఇబ్బంది. అయితే అటువంటి సందర్భంలో మిమ్మల్ని వడ్డీల భారం నుంచి తప్పించే ఓ ఆప్షన్ ఉంది. అది ఏంటంటే.. క్రెడిట్ కార్డు బ్యాలెన్స్ ట్రాన్స్ ఫర్ ఆప్షన్.
Read Also: Kidney Disease: మూత్రపిండానికి మధుమేహ గండం
దాదాపు అన్ని బ్యాంకులకు చెందిన క్రెడిట్ కార్డులపైనా బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్ అనే ఆప్షన్ ఉంటుంది. బ్యాలెన్స్ ట్రాన్స్ ఫర్ ఆప్షన్ ఎంటంటే.. ఒక కార్డులోని అవుట్ స్టాండింగ్ మొత్తాన్ని మరో కార్డుపైకి బదిలీ చేయడం అన్నమాట. ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరూ ఒకటి కంటే ఎక్కువ క్రెడిట్ కార్డులను ఉపయోగిస్తున్నారు. అలా రెండు మూడు కార్డులు వాడుతున్న వారికి ఈ ఆప్షన్ బాగా అవసరం పడుతుంది. ఏదైనా కార్డు బిల్లు చెల్లింపు సమయానికి మీ దగ్గర సరిపడిన నగదు లేకపోతే ఆ మొత్తాన్ని మరో కార్డుపైకి బదిలీ చేసేయొచ్చు. దీంతో మళ్లీ ఆ కార్డు బిల్లు జనరేట్ అయ్యి.. బిల్లు చెల్లింపు తేదీ వచ్చే వరకూ మీకు ఆ డబ్బు చెల్లించడానికి ఛాన్స్ ఉంటుంది.
Read Also: Chittoor Crime: దారుణం.. వరుసకి కొడుకు, సహజీవనం చేయాలంటూ..
అయితే ఈ బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్ ఆప్షన్ వినియోగించాలంటే దానికి ప్రాసెసింగ్ ఫీజుతో పాటు ఇతర చార్జీలను బ్యాంకులు వసూలు చేస్తాయి. ఈ విషయాన్ని వినియోగదారులు గుర్తు పెట్టుకోవాలి. ఈ చార్జీలు బ్యాంకులను బట్టి మారుతుంటాయి. ఆ ఆప్షన్ వినియోగించుకొనే ముందు ఈ నిబంధనలు, చార్జీల వంటి వివరాలు మీరు తెలుసుకోవడం చాలా ముఖ్యం.
తాజావార్తలు
-
Maharashtra: మహా ఘోరం.. పెట్రోల్ బంక్ సీజ్ చేయడానికి వెళ్లిన అధికారి హత్య
-
Zodiac Signs : రాహు-కేతువుల నక్షత్ర సంచారం.. ఈ 4 రాశుల జాతకులకు అదృష్ట యోగం
-
PM Modi: ‘‘మోడీని దించేందుకు ప్రయత్నిస్తున్నారు’’.. సెర్బియా మాజీ అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు
-
UNO-AP: ఏపీ ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు ముందుకొచ్చిన ఐక్యరాజ్యసమితి..
-
Pakistan: ‘‘నెల రోజులు ఆఫీస్‌కు రాని నేత’’.. పాక్ ప్రధాని ముందే నక్వీ షాకింగ్ కామెంట్స్..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!