ఖమ్మం జిల్లాలో సంచలనం కలిగించిన తమ్మినేని కృష్ణయ్య హత్య కేసు నిందితులను ఖమ్మం జిల్లా జైలుకి తరలించారు. . ఖమ్మం జిల్లా తెల్డారుపల్లి లో తమ్మినేని కృష్ణయ్య హత్యకేసులో ఎనిమిది మంది నిందితులను కోర్ట్ కు తరలించగా వారిని 14 రోజుల పాటు రిమాండ్ విధించారు న్యాయమూర్తి. అనంతరం వారిని జైలుకి తరలించారు. ఆగస్టు15 న ఖమ్మం జిల్లా తల్దార్ పల్లి లో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని సోదరుడు కోటేశ్వరరావు…తమ్మినేని కృష్ణయ్య ను హత్య సిపిఎం పార్టీకి చెందిన వారు హత్య చేశారన్న ఆరోపణలు ఉన్నాయి.

Read Also: lightning Strikes: ఒడిశాలో స్కూల్ భవనంపై పిడుగుపాటు.. విద్యార్థులకు తీవ్రగాయాలు
ఈ హత్య కేసులో నిందితులను శుక్రవారం సాయంత్రం ఖమ్మం రెండవ అదనపు ప్రథమ శ్రేణి కోర్టు న్యాయమూర్తి పి.మౌనిక ఎదుట ఖమ్మం రూరల్ పోలీసులు అత్యంత భద్రత నడుమ హాజరు పరిచారు. కాగా నిందితులను ఈనెల 14 వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. తర్వాత నిందితులను భారీ పోలీసు బందోబస్తు నడుమ జైలుకు తరలించారు. ఫిర్యాదు దారుడు తమ్మినేని నవీన్ రూరల్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితులు 8 మందిపై ఇండియన్ పీనల్ కోడ్ లోని సెక్షన్లు 148 ,341 ,132 ,302, 149 సెక్షన్ల క్రింద క్రైం నెం /2022 కేసు నమోదైంది. నిందితులు. బోడబట్ల శ్రీను, గజ్జి కృష్ణస్వామి కన్నెగంటి నవీన్,, మాకరపు లక్ష్మియ్య, బండారు నాగేశ్వరావు,, sk రంజాన్, నూకల లింగయ్య,,జక్కంపూడి కృష్ణయ్య లను రిమాండ్ కీ తరలించారు… ఏ 1 గా ఉన్న కోటేశ్వరరావు ఇంకా పరారీ లో వున్నారు. కాగా నిందితుల తరపున బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా న్యాయమూర్తి తిరస్కరించారు.
Read Also: Suhasini Maniratnam: మా ఆయన ఈ సినిమా కోసం ఏమి కష్టపడలేదు..