ఇండియాలో మరోసారి కరోనా పాజిటివ్ రోజువారి కేసులు తగ్గాయి. కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో కొత్తగా 13, 596 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. మరో 166 మంది కోవిడ్ బాధితులు ప్రాణాలు వదిలారు.. ఇక, ఇదే సమయంలో 19, 582 మంది బాధితులు కోవిడ్ నుంచి పూర్తిస్థాయిలో కొలుకున్నట్టు బులెటిన్‌లో పేర్కొంది కేంద్రం.. దీంతో.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3.40 కోట్లకు పైగా పెరగగా.. రికవరీ కేసులు 3. 34 కోట్లకు పెరిగాయి. ఇక, ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1,89,694 యాక్టివ్ కేసులు ఉన్నట్టు బులెటిన్‌లో పేర్కొంది కేంద్రం. ఇక మరోవైపు.. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ కొనసాగుతుండగా.. ఇప్పటి వరకు 97, 79,47,783 మందికి టీకా వేసినట్లు బులెటిన్‌లో పేర్కొంది కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ.