సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (SII) వచ్చే ఆరు నెలల్లో పిల్లల కోసం కోవిడ్ వ్యాక్సిన్‌ను ప్రారంభించాలని యోచిస్తోందని కంపెనీ సీఈవో అదార్ పూనావాలా మంగళవారం తెలిపారు. పరిశ్రమ సదస్సులో పాల్గొన్న పూనావాలా మాట్లాడుతూ.. ‘కోవోవాక్స్’ వ్యాక్సిన్ ట్రయల్ దశలో ఉందని, మూడేళ్ల వరకు పిల్లలకు రక్షణ కల్పిస్తుందని ఆయన చెప్పారు. ప్రస్తుతం కోవిషీల్డ్, ఇతర కోవిడ్ వ్యాక్సిన్‌లు 18 ఏళ్ల కంటే ఎక్కువ వయస్సు ఉన్న వ్యక్తుల కోసం ఆమోదించబడ్డాయని ఆయన అన్నారు. “మేము పిల్లలలో…