భారత్‌లో క్రియాశీల కొవిడ్ కేసులు శుక్రవారం 3 వేల మార్క్‌కు చేరుకున్నాయి. అయితే సబ్-వేరియంట్ JN-1 మొదటి కేసును గుర్తించిన తర్వాత కేసుల ఆకస్మిక పెరుగుదల మధ్య కేరళలో ఒక మరణం నమోదైందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా చూపించింది. మంత్రిత్వ శాఖ ప్రకారం.. క్రియాశీల కేసులు నిన్న 2,669 ఉండగా.. నేటికి 2,997కి పెరిగాయి.
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పంజాబ్ బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధరించడం తప్పనిసరి చేసింది. అన్ని విద్యా సంస్థలు, ప్రభుత్వ ప్రైవేట్ కార్యాలయాలు, ఇండోర్ / అవుట్‌డోర్ సమావేశాలు, మాల్స్, బహిరంగ ప్రదేశాల్లో మాస్క్‌లు ధరించాలని పంజాబ్ ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది.
దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో 9,923 కొత్త కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. సోమవారంతో పోలిస్తే ఇవాళ 22.4శాతం కేసులు తగ్గినట్లు వెల్లడించింది. తాజా కేసులతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 4,33,19,396కు చేరింది. మరో 17 మంది ప్రాణాలు కోల్పోగా.. ఇప్పటివరకు కరోనా బారిన పడి మృతిచెందిన వారి సంఖ్య 5,24,890కు పెరిగింది. కొత్తగా 7,293మంది రోగులు కోలుకున్నారు. వారితో కలిపి మొత్తం…