కోవిడ్ బాధితులకు వైద్య సౌకర్యాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసిఆర్ గారు అన్ని చర్యలు చేపడుతున్నారని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖా మాత్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. ఈరోజు తొర్రూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన కోవిడ్ ఐసోలేషన్ 30 పడకల విభాగాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా హాస్పిటల్ లో ఏర్పాటు చేసిన ఓ.పి, ఆక్సిజన్ తో కూడిన బెడ్స్ వంటి వైద్య సౌకర్యాలను మంత్రి…