భారత్‌లో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. మంగళవారం దేశంలో 475 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం దేశంలో 3,919 యాక్టివ్ కేసులు ఉన్నట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో కరోనా కారణంగా 6గురు ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపింది.
Covid Cases In India: దేశంలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గత నెల క్రితం కేవలం పదుల్లో ఉండే కేసుల సంఖ్య ప్రస్తుతం వందల్లో నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 760 కోవిడ్ కొత్త కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ గణాంకాలు తెలిపాయి. దీంతో దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 4,423కి చేరింది.
JN.1 Cases: దేశవ్యాప్తంగా ఇటీవల కాలంలో కరోనా కేసుల సంఖ్య పెరగుతోంది. ఇదిలా ఉంటే కోవిడ్ సబ్ వేరియంట్ JN.1 కేసుల్లో పెరుగుదల కూడా కలవరపరుస్తోంది. ఇన్సాకాగ్(INSACOG) డేటా ప్రకారం.. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 263 JN.1 కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల్లో సగం కేరళలోనే నమోదయ్యాయి.
Corona : భారత్‌లో మళ్లీ కరోనా వైరస్ కేసులు పెరగడం మొదలైంది. 24 గంటల్లో దేశంలో మొత్తం 412 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లో 293 మంది రోగులు కోలుకున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా 10 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తన తాజా బులిటెన్‌లో వెల్లడించింది. ఇప్పటి వరకూ మొత్తం నమోదైన కేసుల సంఖ్య దాదాపు 8 లక్షల 44 వేల 558కి చేరింది.
Covid variant JN.1: దేశంలో కోవిడ్ కేసుల సంఖ్య ఇటీవల కాలంలో పెరుగుతోంది. దీంతో పాటు కోవిడ్ కొత్త వేరియంట్ JN.1 చాపకింద నీరులా విస్తరిస్తోంది. తాజాగా దేశవ్యాప్తంగా 63 కొత్త వేరియంట్ JN.1 కేసులు నమోదైనట్లు ఆరోగ్యమంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ కేసులన్నీ కూడా ఆరు రాష్ట్రాల్లోనే నమోదయ్యాయి. మొత్తం 63 కేసుల్లో గోవాలో అత్యధికంగా 34 కేసులు నమోదు అవ్వగా.. మహారాష్ట్రలో 9, కర్ణాటకలో 8, కేరళలో 6, తమిళనాడులో 4,…
Covid-19 Cases: భారతదేశంలో కోవిడ్ మహమ్మారి మరోసారి పడగ విప్పుతోంది. వాతావరణ పరిస్థితులు, చలి పెరడగం కూడా వ్యాధి పెరిగేందుకు కారణమవుతోంది. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 656 కరోనా కేసులు నమోదు అవ్వగా.. ఒకరు మరణించినట్లు కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో 3742 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.
COVID-19: మనదేశంలోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్-19 కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గత నాలుగు వారాల్లో కొత్తగా కోవిడ్ కేసుల సంఖ్య 52 శాతం పెరిగిందని ప్రపంచ ఆరోగ్యం సంస్థ(WHO) తెలిపింది. నెల వ్యవధిలోనే 8,50,000 కొత్త కేసులు నమోదయ్యాయని చెప్పింది. 3000 మరణాలు సంభవించినట్లు పేర్కొంది.
భారత్ లో కరోనా కేసులు మళ్లీ విజృంభిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. దీంతో నెల రోజుల్లో 52 శాతం పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఈ మేరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ అలర్ట్ చేసింది. భారత్ లోనూ కరోనా కేసుల పెరుగుదల కలవర పెడుతుంది.