పతంజలి ఆయుర్వేద్ మేనేజింగ్ డైరెక్టర్ ఆచార్య బాలకృష్ణ, యోగా గురువు బాబా రామ్‌దేవ్‌లు తప్పుడు ప్రకటనలకు బేషరతుగా క్షమాపణలు చెప్పి సుప్రీంకోర్టులో కొత్త అఫిడవిట్ ఇచ్చారు. సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘించినందుకు క్షమాపణలు కూడా చెప్పారు. ఈ అఫిడవిట్‌లో ఆర్డర్‌ను పూర్తిగా పాటిస్తామని చెప్పారు. తప్పుదారి పట్టించే ప్రకటనకు సంబంధించి పతంజలి వివరణాత్మక సమాధానం దాఖలు చేసింది.
S.Jaishankar : విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ శనివారం ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ విదేశాంగ విధానం, దానిని అర్థం చేసుకోవాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు.
TCS: కోవిడ్ మహమ్మారి సమయంలో అన్ని టెక్ కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్(WFH) అవకాశం ఇచ్చాయి. ప్రస్తుతం కోవిడ్ సమస్య సమిసిపోయి సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రస్తుతం అన్ని టెక్ కంపెనీలు కూడా తమ ఉద్యోగులను ఆఫీసులకు రావాలని, రాకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరిస్తున్నాయి. వర్క్ కల్చర్ మెరుగుపరిచేందుకు, భద్రత దృష్ట్యా ఉద్యోగులను ఆఫీసులకు రావాలని, లేకపోతే కెరీర్ పరిమితులను ఎదుర్కోవాల్సి వస్తుందని చెబుతున్నాయి.
Dell: కరోనా మహమ్మారి కారణంగా అన్ని టెక్ సంస్థలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్(WFH) ప్రకటించాయి. అయితే, ఇప్పటికీ కొందరు ఉద్యోగులు ఇంకా రిమోట్ విధానంలో పనిచేస్తున్నారు. ఇప్పటికే పలు కంపెనీలు ఉద్యోగులను ఆఫీసులకు రావాలని ఆదేశిస్తున్నాయి. ఒకవేళ రాకుంటే పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నాయి.
Devon Conway Tested Positive for Coronavirus: న్యూజిలాండ్ క్రికెట్‌లో కరోనా వైరస్ మహమ్మారి కలకలం సృష్టిస్తోంది. ఇప్పటికే స్టార్ ఆల్‌రౌండర్ మిచెల్ శాంట్నర్ కరోనా బారిన పడగా.. తాజాగా స్టార్ ఓపెనర్ డెవాన్ కాన్వేకు వైరస్ సోకింది. ప్రస్తుతం కాన్వే ఐసోలేషన్‌లో ఉన్నాడు. అతడిని క్లోస్ కాంటాక్ట్ అయిన వారు జాగ్రత్తలు తీసుకోవాలని న్యూజిలాండ్ బోర్డు హెచ్చరించింది. కరోనా పాజిటివ్ రావడంతో పాకిస్థాన్‌తో జరిగే నాలుగో టీ20 మ్యాచ్‌కు కాన్వే దూరమయ్యాడు. అతడి స్థానంలో చాడ్…
S Jaishankar: న్యూఢిల్లీలో సంప్రదింపులు లేకుండా ప్రస్తుతం ప్రపంచం ఏ సమస్యపై నిర్ణయం తీసుకోలేదని, భారత్ ప్రపంచంలో చాలా కీలకంగా మారిందని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ అన్నారు. భారత్ మారిందని, ప్రపంచం మనల్ని చూసే దృష్టి కూడా మారిందని ఆయన శనివారం అన్నారు. భారత్ స్వతంత్రంగా ఉండటమే దీనికి కారణమని.. భారత్ వేరొకరి సంస్థలా కాకుండా, తన ప్రయోజనాల కోసం పరస్పరం విభిన్న దేశాలతో కలిసి పనిచేస్తుందని ఆయన అన్నారు.
Bat Virus: గబ్బిలాల్లో ప్రాణాంతక వైరస్‌ని పరిశోధనా బృందం థాయ్‌లాండ్‌లో కనుగొంది. గతంలో కరోనా వైరస్‌తో ముడిపడి ఉన్న ఎకోహెల్త్ అలయన్స్ పరిశోధకులే ఈ డెడ్లీ బ్యాట్ వైరస్‌ని కనుగొన్నారు. ఈ సంస్థ చీఫ్ డాక్టర్ పీటర్ దస్జాక్ కోవిడ్ లాగే మానవులకు సోకే అవకాశం ఉన్న వైరస్‌ని కనుగొన్నట్లు డైలీ మెయిల్ నివేదించింది. గతంలో ఈ పరిశోధర బృందానికి చైనా వూహాన్ వివాదాస్పద ప్రయోగశాలతో సంబంధం ఉంది. థాయ్‌లాండ్ లోని ఓ గుహలోని గబ్బిలాల్లో ఈ…
దేశవ్యాప్తంగా ఇటీవల కాలంలో కోవిడ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గతంలో రెండంకెల లోపే కేసులు నమోదైతే, ఇప్పుడు వందల్లో కేసులు వస్తున్నాయి. దీంతో పాటు ప్రమాదకరమైన వేరియంట్ JN.1 కలవరపరుస్తోంది. కేసుల సంఖ్య పెరిగేందుకు ఇది కూడా కారణమవుతోంది.
Heart Attack: ఇటీవల దేశంలో పలు ప్రాంతాల్లో యుక్తవయసులో పలువురు వ్యక్తులు గుండెపోటుకు గురై మరణిస్తున్నారు. చివరకు చిన్న పిల్లల్ని కూడా హార్ట్ ఎటాక్ కారణంగా మరణించడం ఆందోళన కలిగిస్తోంది. డ్రాన్సులు, జిమ్ సెంటర్లలో ఉన్నట్లుండి ఇలా గుండెపోటుకు గురైన పలు సందర్భాలను మనం చూస్తున్నాం. తాజాగా ఇలాగే ఓ వ్యక్తి క్రికెట్ ఆడుతూ మైదానంలోనే మరణించడం విషాదాన్ని నింపింది.