Covid Sub-Variant JN.1: దేశవ్యాప్తంగా ఇటీవల కాలంలో కోవిడ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గతంలో రెండంకెల లోపే కేసులు నమోదైతే, ఇప్పుడు వందల్లో కేసులు వస్తున్నాయి. దీంతో పాటు ప్రమాదకరమైన వేరియంట్ JN.1 కలవరపరుస్తోంది. కేసుల సంఖ్య పెరిగేందుకు ఇది కూడా కారణమవుతోంది.
ఇదిలా ఉంటే మాల్దీవ్స్ నుంచి ఇండియా వచ్చిన 33 ఏళ్ల మహిళలో జెఎన్.1 సబ్-వేరియంట్ కరోనావైరస్ ఉన్నట్లు తేలింది. మధ్యప్రదేశ్ ఇండోర్ నగరంలో పరీక్షించగా ఈ వైరస్ ఉన్నట్లు కొనుగొన్నారు. ప్రస్తుతం ఆమె కోలుకుంటున్నట్లు శుక్రవార అధికాకులు తెలిపారు. డిసెంబరు 13న ఆ మహిళకు కరోనా పాజిటివ్ అని తేలింది. భోపాల్‌కు చెందిన ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)లో ఆమె శాంపిల్ హోల్ జీనోమ్ సీక్వెన్సింగ్ (డబ్ల్యుజిఎస్) కోసం పంపించారు, తాజాగా గురువారం వచ్చిన నివేదికలో JN.1 వేరియంట్ ఆమెకు సోకినట్లు నిర్ధారించబడింది.
Read Also: Praja Palana Sub-Committee: ఐదు గ్యారెంటీలను కచ్చితంగా అమలు చేసి తీరుతాం..
ప్రస్తుతం మాల్దీవులు, ఇండియా మధ్య దౌత్య వివాదం నడుస్తున్న సమయంలో అక్కడి నుంచి వచ్చిన మహిళలో ఈ వేరియంట్ ఉండటం చర్చనీయాంశం అయింది. ప్రధాని నరేంద్రమోడీ లక్షద్వీప్ వెళ్లడంపై మాల్దీవ్స్ మంత్రులు అవమానకరంగా మాట్లాడటం వివాదాస్పమైంది. భారతీయలు ‘బాయ్‌కాట్ మాల్దీవ్స్’ అంటూ ఆన్‌లైన్‌లో ట్రెండ్ చేస్తున్నారు.