సోషల్ మీడియాలో సెగలు రేపుతున్న సిద్ధార్థ్ ట్వీట్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సామాజికాంశాల విషయమై తన అభిప్రాయాలను నిక్కచ్చిగా చెప్పడం మొదటి నుండి హీరో సిద్ధార్థ్ కు అలవాటు. దాంతో కొన్నిసార్లు చిక్కుల్లో పడ్డాడు కూడా. అయినా ఆ అలవాటు మార్చుకునే ప్రయత్నం సిద్ధార్థ్ ఎప్పడూ చేయలేదు. తాజాగా సిద్ధార్థ్ చేసిన ఓ ట్వీట్ సోషల్ మీడియాలో సెగలు రేపుతోంది. ప్రస్తుతం కరోనా కారణంగా దేశం అట్టుడిపోతుంటే ప్రభుత్వాలు పెద్దంతగా పట్టించుకోవడం లేదని సిద్ధార్థ్ భావిస్తున్నాడు. ఇదే సమయంలో ఈ విషయంలో ప్రభుత్వాలను ప్రశ్నించాల్సిన సెలబ్రిటీస్ సైతం మౌనంగా ఉండటం కరెక్ట్ కాదని అతను అభిప్రాయ పడుతున్నాడు. ‘మిలియన్ల ఫాలోవర్స్ ఉన్న వ్యక్తులు నిశ్శబ్దంగా కళ్ల ముందు జరుగుతున్న హారర్ షోను చూస్తున్నార’ని వ్యాఖ్యానించిన సిద్ధార్థ్… అందుకు వాళ్ళ కారణాలు వాళ్ళకు ఉండొచ్చు కానీ ప్రజలు ఈ విషయమై మాట్లాడాలని, ప్రభుత్వాలని ప్రశ్నించాలని కోరాడు. ప్రజారోగ్యం విషయమై ప్రభుత్వాలను డిమాండ్ చేయాలని అన్నాడు. అప్పుడే ఈ పరిస్థితుల నుండి బయటపడగలమని, ప్రజలు కళ్ళు తెరవాలని ట్వీట్ చేశాడు. స్టార్ హీరోలను ఉద్దేశించే సిదార్థ్ ఇలాంటి వ్యాఖ్యలు చేశాడని కొందరంటుంటే, మొదటి నుండి సిద్ధార్థ్ యాంటీ బీజేపీ అని, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా అతను ఇలా వ్యాఖ్యానించాడని మరికొందరు అంటున్నారు. నెటిజన్లు మాత్రం యాంటీ సిద్ధార్థ్, ప్రో సిద్ధార్థ్ గా మారిపోయారు. ఇలాంటి సమయంలో ప్రజలను రెచ్చగొట్టడం సమంజసం కాదని కొందరు అంటుంటే… ప్రశ్నించకపోతే ప్రభుత్వాలు పనులు ఎలా చేస్తాయని మరి కొందరంటున్నారు. మొత్తానికి సిద్దార్థ్ ట్వీట్ చినికి చినికి గాలివానగా మారేట్టు ఉంది.
Also Read
తాజావార్తలు
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!