దేశంలో ప్రస్తుతం కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. ఇప్పుడు కరోనా వల్ల పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి. ఈ పరిస్థితుల్లో పలు రాష్ట్రాలు మరోసారి లాక్ డౌన్ దిశగా అడుగులు వేస్తున్నాయి. అయితే కరోనా నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి వ్యాక్సినేషన్ చాలా ముఖ్యం. చాలామంది సెలెబ్రిటీలు ఇప్పటికే మొదటి డోస్ కరోనా వ్యాక్సిన్ తీసుకోగా… కొంతమంది సెకండ్ డోస్ కూడా తీసుకుంటున్నారు. ఇటీవలే కలెక్షన్ కింగ్ మోహన్ బాబు సెకండ్ డోస్ వ్యాక్సినేషన్ తీసుకున్నారు. తాజాగా సీనియర్ నటి రమ్యకృష్ణ కూడా సెకండ్ డోస్ వ్యాక్సిన్ ను తీసుకున్నారు. ఈ వైరస్ కు ఈ ఏడాది ఆరంభం నుండి వ్యాక్సిన్ అందిస్తున్నారు. కాగా తాజాగా రాష్ట్రంలో 8061 కరోనా కేసులు నమోదయ్యాయి. మరోవైపు తాజాగా దేశంలో కొత్తగా 3,60,960 కేసులు నమోదయ్యాయి.