ప్రముఖ తమిళ నటుడు వివేక్ ఈ యేడాది ఏప్రిల్ 17వ తేదీ హఠాన్మరణం చెందారు. కమెడియన్ గా, సహృదయుడిగా చక్కని పేరు తెచ్చుకున్న వివేక్ మరణంతో తమిళ చిత్రసీమ ఒక్కసారి ఉలిక్కిపడింది. దానికి కారణం ఆయన చనిపోవడానికి ఒక రోజు ముందు కొవిడ్ 19కు వాక్సిన్ వేయించుకోవడమే! ఆయన మరణానికి వాక్సిన్ వేయించుకోవడం కారణం కాదని ఆరోగ్యశాఖ అప్పుడే వివరణ ఇచ్చింది. అయినా కొన్ని మీడియా సంస్థలు వాక్సిన్ వికటించి వివేక్ మరణించారంటూ ముమ్మరంగా ప్రచారం చేశాయి.…
కరోనాపై విజయం సాధించాలంటే ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న ఏకైక ఆయుధం వ్యాక్సినేషన్.. దీంతో.. అన్ని దేశాలు వ్యాక్సినేషన్‌పై దృష్టిసారించాయి.. కొన్ని వ్యాక్సిన్లు సింగిల్ డోసు అయితే.. మెజార్టీ వ్యాక్సిన్లు మాత్రం ఫస్ట్ అండ్ సెకండ్.. ఇలా రెండు డోసులు వేసుకోవాల్సి ఉంది.. అయితే, రెండు రోజులు వేయించుకున్నా.. కరోనా రాదనే గ్యారంటీ మాత్రం లేదు.. కానీ, ఆస్పత్రిలో చేరే పరిస్థితిని తగ్గిస్తుంది.. ఇక, రెండు డోసులు తీసుకున్నవారికి బూస్టర్ డోస్‌పై కూడా ప్రయోగాలు సాగుతున్నాయి.. ఈ…
దేశవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టినట్లే కనిపించిన మళ్లీ మూడు రోజులుగా క్రమంగా పెరుగుతున్నాయి. 30వేల దిగువకు వచ్చిన కేసులు.. గత 24 గంటల్లో 34,403 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. 320 మంది మరణించారు. ముఖ్యంగా కేరళలో కరోనా తన ప్రతాపం చూపిస్తోంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం, ఈ 34,403 కేసుల్లో దాదాపు 65 శాతం కేసులు కేరళ నుంచి నమోదయ్యాయి. గత 24 గంటల్లో కేరళలో 22,182 కోవిడ్ -19 కేసులు…
కరోనా క్రైసిస్ ఛారిటీని మొదలెట్టి గత ఏడాది కరోనా సమయంలో సినిమా కార్మికులకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ఈ సారి కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో సినిమా కార్మికులకు వాక్సిన్ వేయించే కార్యక్రమం కొంతకాలంగా చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ కార్యాలయంలో జరుగుతోంది. ఈ కార్యక్రమంలో 24 క్రాఫ్ట్స్ కు సంబందించిన సినీ కార్మికులకు వాక్సిన్ ఇస్తున్నారు. ఇప్పటికే ఫస్ట్ డోస్ వ్యాక్సినేషన్ కార్యక్రమం సక్సెస్ కావడంతో పాటు రెండో డోస్ వ్యాక్సినేషన్ కూడా తుదిదశకు చేరుకుంది.…
కరోనా మహమ్మారిపై పోరాటంలో భాగంగా వ్యాక్సినేషన్‌పై ప్రత్యేకంగా దృష్టిసారించింది కేంద్రం… ఎప్పటికప్పుడు దీనిపై అన్ని రాష్ట్రాలను, కేంద్ర పాలిత ప్రాంతాలను అలెర్ట్ చేస్తూ.. కావాల్సిన డోసులు సరఫరా చేస్తోంది.. ఇక, వ్యాక్సినేషన్‌పై తాజాగా ఓ ప్రకటన చేసింది కేంద్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ.. ప్రస్తుతం వ్యాక్సినేషన్ శరవేగంగా సాగుతోందని తెలిపిన కేంద్రం.. ఇప్పటికే రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు 65,00,99,080 వ్యాక్సిన్ డోసులను పంపించాం.. త్వరలో మరో 1,20,95,700 వ్యాక్సిన్ డోసులు సమకూర్చనున్నట్టు ప్రకటించింది. అయితే,…
భారత్‌లో కరోనా సెకండ్ వేవ్ కేసులు పూర్తిగా అదుపులోకి రాకముందే.. మళ్లీ రోజువారి పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ పోతోంది.. దీంతో కొత్త ప్రమాదం పొంచిఉందా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.. దేశంలో మరో కొత్తరకం కరోనా వైరస్ సెప్టెంబర్ నెలలో వెలుగు చూస్తే.. అక్టోబర్-నవంబర్ మధ్య కాలంలో గరిష్ఠానికి చేరుకోవచ్చని తాజా అధ్యయనం వెల్లడించింది. సెకండ్ వేవ్‌తో పోలిస్తే దాని తీవ్రత అతి స్వల్పంగానే ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు. దేశంలో కరోనా మూడో ముప్పు అనివార్యమని…
కరోనా హమ్మారిపై విజయం సాధించడానికి రకరకాల వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి.. కొన్ని దేశాలు స్వయంగా వ్యాక్సిన్లు తయారు చేస్తే.. మరికొన్ని దేశాలు వాటిని దిగుమతి చేసుకుని తమ ప్రజలకు అందిస్తున్నాయి.. అయితే, అక్కడక్కడ వ్యాక్సిన్లు వికటించిన మృతిచెందినట్టు వార్తలు వస్తూనే ఉన్నాయి.. తాజాగా, న్యూజిలాండ్‌లో ఓ మహిళ మృతిచెందారు.. ఫైజర్ వ్యాక్సిన్ తీసుకున్న ఓ మహిళ చనిపోయినట్లు న్యూజిలాండ్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది.. ఫైజర్ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత అత్యంత అరుదైన మయోకార్డిటిస్ అంటే గుండె…
కరోనా మహమ్మారికి వ్యాక్సిన్‌తో చెక్ పెట్టే ప్రక్రియ కొనసాగుతోంది.. సాధ్యమైనంత త్వరగా వ్యాక్సినేషన్ పూర్తి చేయాలన్న ప్రణాళికలతో ముందుకు వెళ్తోన్న ప్రభుత్వం.. వ్యాక్సిన్ల కొరతకు తీర్చేందుకు స్వదేశీ వ్యాక్సిన్లకు తోడు విదేశీ వ్యాక్సిన్లకు కూడా అనుమతి ఇస్తూ వస్తోంది.. ఇక, ఈ నేపథ్యంలో కరోనా బారిన పడి కోలుకున్న వాళ్లకు ఐసీఎంఆర్ అధ్యయనం ఓ గుడ్‌న్యూస్ చెప్పింది.. ఇప్పటికే కోవిడ్ సోకినవాళ్లు కోవాగ్జిన్.. వ్యాక్సిన్ ఒక్క డోసు తీసుకున్నా చాలని చెబుతోంది ఐసీఎంఆర్.. కోవిడ్ సోకని వాళ్లు…
కరోనా మహమ్మారి కట్టడికోసం ఇప్పుడున్న ఏకైక మార్గం వ్యాక్సినేషన్.. ప్రపంచదేశాలతో పాటు.. భారత్‌లో కూడా వ్యాక్సినేషన్‌పై ప్రత్యేకంగా దృష్టిసారించింది.. ఇప్పటికే దేశ్యాప్తంగా 62.29 కోట్లకు పైగా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసింది భారత్.. ఇక, శుక్రవారం ఒకేరోజు కోటి డోసులు వేసి.. మరో అరుదైన ఘనత సాధించారు.. దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ అభినందనలు తెలిపింది.. భారత్‌లో ఒకేరోజు కోటి మందికి వ్యాక్సినేషన్‌పై సంతోషాన్ని వ్యక్తం చేశారు డబ్ల్యూహెచ్‌వో చీఫ్ సైంటిస్ట్ సౌమ్యాస్వామినాథన్.. సోషల్ మీడియా వేదికగా…
కరోనా టీకా ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాల్లో అందుబాటులోకి వచ్చింది. వ్యాక్సినేషన్ సైతం యుద్ద ప్రాతిపధికన సాగుతోంది. అయితే, కొన్ని దేశాల్లో చిన్నపిల్లలకు కూడా టీకా ఇస్తున్నారు. భారత్‌లో ఎప్పుడెపుడు పిల్లలకు వ్యాక్సిన్ ఇస్తారా అని ఎదురు చూస్తున్నారు తల్లిదండ్రులు. పెద్దలకు టీకా అందింది కానీ పిల్లలకు ఇప్పటి వరకు టీకా ఇవ్వట్లేదు. మరోపక్క స్కూళ్లు, కాలేజీలకు పంపలేని పరిస్థితి కరోనా సెకండ్వేవ్తగ్గినట్లే కనిపిస్తోంది. రానున్న రోజుల్లో పరిస్థితులు ఎలా ఉంటాయో అర్థం కావటం లేదు. ఇప్పటివరకు…