కరోనా టీకా ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాల్లో అందుబాటులోకి వచ్చింది. వ్యాక్సినేషన్ సైతం యుద్ద ప్రాతిపధికన సాగుతోంది. అయితే, కొన్ని దేశాల్లో చిన్నపిల్లలకు కూడా టీకా ఇస్తున్నారు. భారత్‌లో ఎప్పుడెపుడు పిల్లలకు వ్యాక్సిన్ ఇస్తారా అని ఎదురు చూస్తున్నారు తల్లిదండ్రులు. పెద్దలకు టీకా అందింది కానీ పిల్లలకు ఇప్పటి వరకు టీకా ఇవ్వట్లేదు. మరోపక్క స్కూళ్లు, కాలేజీలకు పంపలేని పరిస్థితి కరోనా సెకండ్వేవ్తగ్గినట్లే కనిపిస్తోంది. రానున్న రోజుల్లో పరిస్థితులు ఎలా ఉంటాయో అర్థం కావటం లేదు. ఇప్పటివరకు వ్యాక్సిన్ పొందని 18 ఏళ్ల లోపు వారు వైరస్‌ను తట్టుకోగలరా? అనే ప్రశ్నలు తలెత్తున్నాయి.. అందుకే పిల్లలకు కరోనా వ్యాక్సిన్ వస్తే మంచిదని ఎదురు చూస్తున్నారంతా. ఇండియా పిడియాట్రిక్ ఫెడరేషన్ సైతం పిల్లలకు వ్యాక్సిన్ ఇవ్వాలనే కోరుతోంది. మరోవైపు.. స్కూళ్లను తిరిగి తెరిచేవైపు రాష్ట్రాలు అడుగులు వేస్తున్నాయి.. దీనికోసం టీచర్లు, స్కూల్ సిబ్బందికి పూర్తిస్థాయిలో వ్యాక్సిన్ వేసేలా చర్యలు తీసుకుంటున్నారు.. పిల్లల వ్యాక్సిన్ కూడా అందుబాటులోకి వస్తే.. విద్యార్థులకు కూడా వ్యాక్సిన్ వేస్తే బాగుంటుందనే వాదనలు ఉన్నాయి.