మరోసారి కరోనా మహమ్మారి పంజా విసురుతోంది.. దీంతో కట్టడి చర్యలకు పూనుకుంటున్నాయి ఆయా రాష్ట్రాలు, నైట్ కర్ఫ్యూలు, సంపూర్ణ లాక్‌డౌన్‌లు.. ప్రజలు ఎక్కువగా కలుసుకునే అవకాశం ఉన్న విందు, వినోదాలపై ఆంక్షలు.. ఇలా పలు రకాల చర్యలు తీసుకుంటున్నారు.. తమిళనాడు ప్రభుత్వం సంపూర్ణ లాక్‌డౌన్ ప్రకటించింది.. ఆదివారం అంటే ఇవాళ ఒక్కరోజు సంపూర్ణ లాక్‌డౌన్ అమలు చేస్తున్నారు.. అత్యవసర సేవలు మినహా వేటికీ అనుమతి లేదని ఇప్పటికే ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి.. అయితే, ఇవాళ ఒకేరోజుకు…
భారత్‌లో కరోనా మరోసారి పడగవిప్పుతోంది.. గత ఐదారు రోజులుగా యమ స్పీడ్‌గా పెరిగిపోతున్నాయి పాజిటివ్ కేసులు.. నిన్నటితో పోలిస్తే.. ఇవాళ ఏకంగా 18 వేలకు పైగా కేసులు పెరిగాయి.. అయితే, సౌతాఫ్రికాలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వెలుగు చూసిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ కేసులు పెరుగుతూ పోతున్నాయి.. భారత్‌లోనూ ఒమిక్రాన్ ఎంట్రీ తర్వాతే రోజువారి కేసులు మరోసారి కోవిడ్ మీటర్ పరుగులు పెడుతోంది.. ఇక, భారత్‌లో థర్డ్ వేవ్ ప్రారంభమైందని.. ఇప్పటికే 15కు పైగా రాష్ట్రాల్లో…
తెలంగాణలో కరోనా వైరస్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఇప్పటికే పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులు కరోనా బారిన పడ్డారు. తాజాగా టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. కోవిడ్ లక్షణాలు కనిపించడంతో శనివారం పరీక్షలు చేయించుకోగా.. పాజిటివ్ వచ్చినట్లు స్వయంగా ఆయనే వెల్లడించారు. ఇటీవల తనను కలసిన వారంతా కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని ఎమ్మెల్సీ సూచించారు. కరోనా థర్డ్ వేవ్ విజృంభిస్తున్న తరుణంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. Read Also:…
భారత్‌లో కరోనా కల్లోలం మళ్లీ మొదలైంది.. కరోనా థర్డ్ వేవ్ ప్రభావం భారత్‌పై ఏ స్థాయిలో ఉందో.. వరుసగా వెలుగు చూస్తున్న కొత్త కేసులే చెబుతున్నాయి.. గత ఐదు రోజులుగా ప్రతీ రోజు భారీ సంఖ్యలో కొత్త కేసులు వెలుగు చూస్తూ.. కరోనా మీటర్ పరుగులు పెడుతోంది… కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 1,59,632 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి, మరో 327 మంది కోవిడ్…
దేశంలో కరోనా పాజిటివ్ కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో భారత్ బయోటెక్ సంస్థ గుడ్‌న్యూస్ చెప్పింది. రెండు డోసుల టీకా తీసుకున్నవారు ఆరు నెలల తరువాత కొవాగ్జిన్ బూస్టర్ డోసు వేయించుకుంటే కరోనా నుంచి మెరుగైన రక్షణ పొందవచ్చని భారత్ బయోటెక్ తెలిపింది. క్లినికల్ ట్రయల్స్‌లో ఈ ఫలితం వెల్లడైందని, సైడ్ ఎఫెక్ట్స్ కూడా కనిపించలేదని స్పష్టం చేసింది. కొవాగ్జిన్ వ్యాక్సిన్‌తో నిర్వహించిన బూస్టర్ డోస్ ఫేజ్-2 ప్రయోగ ఫలితాలను భారత్ బయోటెక్ వెల్లడించింది. Read Also:…
మహారాష్ట్రలో కరోనా కేసులు భారీ సంఖ్యలో నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో మహారాష్ట్రలో 41,434 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇందులో 9,671 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 13 మంది మృతి చెందారు. మహారాష్ట్రలో 1,73,238 యాక్టివ్ కేసులు ఉండగా, మొత్తం ఇప్పటి వరకు కరోనాతో 1,41,627 మంది మృతి చెందారు. ముంబై నగరంలో గడిచిన 24 గంటల్లో 20,318 కేసులు నమోదయ్యాయి. కరోనాతో ముంబైలో 5 మంది మృతి చెందారు. ఒక్క ముంబై నగరంలోనే 1,06,037…
ఢిల్లీలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఒమిక్రాన్ కారణంగా కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఢిల్లీలో 20,181 కొత్త కేసులు నమోదయ్యాయి. కరోనాతో ఏడుగురు మృతి చెందారు. ప్రస్తుతం ఢిల్లీలో 48,178 కేసులు యాక్టీవ్‌గా ఉండగా, 24 గంటల్లో 11,869 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఢిల్లీలో ఇప్పటి వరకు మొత్తం 25,143 మంది కరోనాతో మృతిచెందారు. ఇక ఇదిలా ఉంటే, ఢిల్లీలో పాజిటివిటీ రేటు 19.6 శాతంగా ఉన్నట్టు ఢిల్లీ ఆరోగ్యశాఖ బులిటెన్‌లో పేర్కొన్నది.…
కరోనా మహమ్మారి కేసులు భారీగా పెరుగుతున్న వేళ భారత్ బయోటెక్ ఫార్మా బూస్టర్ డోస్‌పై కీలక ప్రకటన చేసింది. కోవాగ్జిన్ రెండో డోస్ తీసుకున్న ఆరు నెలల తరువాత బూస్టర్ డోస్ తీసుకోవడం ద్వారా వారిలో డెల్టాను నిలువరించే యాంటాబాడీలు ఐదురెట్టు వృద్ధి చెందుతాయని భారత్ బయోటెక్ తెలియజేసింది. అంతేకాదు, బూస్టర్ డోస్ తీవ్రమైన వైరస్‌ను 90శాతం కట్టడి చేస్తుందని పేర్కొన్నది. బూస్టర్ డోసులు తీసుకున్నావారిలో టి, బి సెల్స్‌ను గుర్తించామని తెలియజేసింది. Read: బెంగళూరులో 10శాతం…
కరోనా తన ప్రతాపం చూపుతోంది. మళ్ళీ ఎవరినీ వదలడం లేదు. నెల్లూరు జిల్లా శ్రీహరి కోటలోని షార్ లో కరోనా థర్డ్ వేవ్ దడ పుట్టిస్తోంది. ఒకే రోజు ఇద్దరు వైద్యులతో సహా 12 మంది ఉద్యోగులకు పాజిటివ్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన అధికారులు ఒమిక్రాన్ అనుమానంతో వీరి నమూనాలను ల్యాబ్ కు పంపారు. శ్రీహరి కోటలోని షార్ లో కరోనా మూడో వేవ్ మొదలైంది. కొత్త సంవత్సర వేడుకల కోసం పలువురు ఉద్యోగులు, సొంతూళ్ళకు వెళ్లి…
కరోనా మహమ్మారి మనుషుల మధ్య బంధాలను తెంచేస్తోంది. మనుషుల మానవత్వాన్ని చంపేస్తేన్నది. అమెరికాలో కరోనా కేసులు భారీ సంఖ్యలో నమోదవుతున్న సంగతి తెలిసిందే. ప్రతిరోజూ లక్షలాది మంది కరోనా బారిన పడుతున్నారు. చిన్నారులు అధిక సంఖ్యలో కరోనా బారిన పడుతున్నారు. అమెరికాలోని టెక్సాన్ కు చెందిన సారాబీమ్ అనే మహిళ డ్రైవ్ త్రూ టెస్టింగ్ కేంద్రానికి కారును తీసుకొని వచ్చారు. అలా వచ్చిన ఆ మహిళ కారు డిక్కిలో నుంచి మాటలు వినిపిస్తుండటంతో అక్కడ ఉన్న సిబ్బంది…