వాళ్ళు ఉన్నప్పుడు ఇబ్బంది పడ్డాం.... మనం పవర్‌లోకి వచ్చాకా... ఇబ్బందులు పడుతున్నాం. ఇక బతుకంతా ఇంతేనా? కొట్లాడుతూనే ఉండాల్నా? ఇంకెన్నాళ్ళిలా పోరాటం.... అంటూ తెగ ఫ్రస్ట్రేట్ అయిపోతున్నారట ఆ మాజీ ఎమ్మెల్యే. ఏదేమైనా సరే... వెనక్కి తగ్గేదే లేదు. ప్రైవేట్ కేసులు వేసైనా సరే... నేను అనుకున్నది సాధిస్తానంటున్న ఆ లీడర్ ఎవరు? ఆయన అసహనానికి కారణం ఏంటి?
పోడు భూముల లొల్లిఎటూ తెగడం లేదు. భూమే తమకు ఆధారం అని ఆదివాసీలంటుంటే అసలు అక్కడ పోడు భూమే లేదంటున్నారు అటవీశాఖ అధికారులు. అరెస్ట్ చేసి జైల్లో పెట్టినా తిరిగొచ్చాక సైతం ఆదివాసీలు భూమి కోసం ఆరాటపడుతుంటే అధికారులు అది కవ్వాల్ టైగర్ జోన్ అంటూ ఖరాకండిగా చెప్పేస్తున్నారు. ఎంత చేసినా ఎట్టి పరిస్థితుల్లో భూమి ఇవ్వబోమని అటవీశాఖ తేల్చి చెబితే.. .తాము ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూమిని వదల బోమంటున్నారు ఆదివాసీలు..మంచిర్యాల జిల్లా కోయపోష గూడెంలో…