దేశ వ్యాప్తంగా ఎన్నికల ప్రచారానికి గురువారంతో ఫుల్ స్టాప్ పడింది. ప్రచార మైకులన్నీ మూగబోయాయి. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన దగ్గర నుంచి ఆయా పార్టీల నేతలు, కార్యకర్తలు ప్రచారాల్లో మునిగిపోయారు.
నేటి రాజకీయాలలో చదువుకున్న వాళ్లకు కూడా వెలకట్టే పరిస్థితి వచ్చిందని బీజేపీ నేత ఈటల రాజేందర్ అన్నారు. వరంగల్ జిల్లా ఏకశిలా నగర్‌లో జరిగిన యూత్ మీటింగ్‌లో ఆయన పాల్గొని మాట్లాడారు. ఓటు హక్కును సక్రమంగా వినియోగించుకోవాలని సూచించారు.
అమెరికా మరోసారి భారత్ ను మెచ్చుకుంది. భారత్ లో సార్వత్రికి ఎన్నికలపై అమెరికా ప్రశంసలు కురిపించింది. ప్రపంచంలో భారత్ కంటే శక్తివంతమైన ప్రజాస్వామ్య దేశం మరొకటి లేదని కొనియాడింది. ఆ దేశ వైట్ హౌస్ జాతీయ భద్రతా సమాచార సలహాదారు జాన్ కిర్బీ ఓ ప్రశ్నకు సమాధానమిస్తూ భారత్‌ను ప్రశంసించారు.
దేశ వ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు తీవ్ర రూపంలో ఎండలు హడలెత్తిస్తున్నాయి. కాగా.. ఇంతటి ఎండల్లో ఒక చల్లటి వార్త బయటికొచ్చింది. రాబోయే రోజుల్లో కొన్ని చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు.. చాలా చోట్ల ప్రజలు వేడిగాలులను ఎదుర్కొనే అవకాశం ఉంది.. అయితే కాలక్రమేణా పరిస్థితి మెరుగుపడి వేడిగాలులు తగ్గుతాయని పేర్కొంది.
కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి రాజీవ్‌కుమార్‌కు కేంద్ర హోంశాఖ జెడ్ కేటగిరీ భద్రతను కల్పించింది. ముప్పు పొంచి ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.
దేశ వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. ఉదయం నుంచే సూర్యుడు భగభగమండిపోతున్నాడు. తీవ్రమైన వేడితో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. బయటకు రావాలంటేనే హడలెత్తిపోతున్నారు.
దేశం పేరు మార్చాలన్న డిమాండ్ మరోసారి తెరపైకి వచ్చింది. ఇండియా పేరును భారత్‌గా మార్చాలని డిమాండ్ ఎప్పట్నుంచో ఉంది. తాజాగా మళ్లీ లోక్‌సభలో ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది.
Udhayanidhi Stalin : మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లలో బీజేపీ చరిత్రాత్మక విజయాలను నమోదు చేసింది. బీజేపీ అఖండ విజయంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. బీజేపీ సంబరాల్లో మునిగితేలుతుండగా.. కాంగ్రెస్ సహా విపక్షాలన్నీ షాక్‌కు గురయ్యాయి.