దేశంలో ఎందరో ఐఏఎస్-ఐపీఎస్ అధికారులు వార్తల్లో నిలుస్తున్నారు. అయితే.. దేశంలోనే అత్యంత ధనవంతులైన ఐఏఎస్ అధికారుల్లో పేరున్న ఐఏఎస్ అధికారి ఒకరు ఉన్నారు. ఆయన నెలకు రూ.1 జీతం మాత్రమే తీసుకోవడం విశేషం. ఆయన పేరు అమిత్ కటారియా. ఆయన నికర విలువ కోట్లలో ఉంటుంది.
లోక్‌సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ శ్రీనగర్‌లో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రధాని మోడీని, బీజేపీని తీవ్రంగా టార్గెట్ చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఊరు వాడ మొత్తం గణేశుని నామస్మరణంతో మారుమోగుతోంది. లంబోధరుడిని వివిధ రూపాల్లో కొలువుతీర్చి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.
కెన్యా ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త పన్నుల విధానంతో దేశ అట్టుడికింది. పెద్ద ఎత్తున నిరసనలు, ఆందోళనలు వ్యక్తమవ్వడంతో పరిస్థితులు చేయిదాటి హింసాత్మకంగా మారింది. పోలీసులకు-నిరసనకారుల మధ్య జరిగిన ఘర్షణతో పరిస్థితులు మొత్తం రణరంగంగా మారాయి
మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (MIT) మరోసారి QS వరల్డ్ యూనివర్శిటీ ర్యాంకింగ్స్ 2025 లో తన ఆధిపత్యాన్ని కొనసాగించింది. ఈ వర్సిటీ గత 13 ఏళ్లుగా నిరంతరం అగ్రస్థానంలో కొనసాగుతోంది. మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అనేది మసాచుసెట్స్‌లోని కేంబ్రిడ్జ్‌లోని ఒక ప్రైవేట్ పరిశోధనా విశ్వవిద్యాలయం.
లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక ఆధిక్యతతో గెలుపొందిన గత రికార్డును ఐదుగురు అభ్యర్థులు బద్దలు కొట్టారు. అందులో బీజేపీకి చెందిన అభ్యర్థులు నలుగురు ఉన్నారు. ఇండోర్ నుంచి ప్రస్తుత బీజేపీ ఎంపీ శంకర్ లాల్వానీ 11.72 లక్షల ఓట్ల తేడాతో విజయం సాధించి ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచారు.
దేశ వ్యాప్తంగా ఎన్నికల ప్రచారానికి గురువారంతో ఫుల్ స్టాప్ పడింది. ప్రచార మైకులన్నీ మూగబోయాయి. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన దగ్గర నుంచి ఆయా పార్టీల నేతలు, కార్యకర్తలు ప్రచారాల్లో మునిగిపోయారు.
నేటి రాజకీయాలలో చదువుకున్న వాళ్లకు కూడా వెలకట్టే పరిస్థితి వచ్చిందని బీజేపీ నేత ఈటల రాజేందర్ అన్నారు. వరంగల్ జిల్లా ఏకశిలా నగర్లో జరిగిన యూత్ మీటింగ్‌లో ఆయన పాల్గొని మాట్లాడారు. ఓటు హక్కును సక్రమంగా వినియోగించుకోవాలని సూచించారు.
అమెరికా మరోసారి భారత్ ను మెచ్చుకుంది. భారత్ లో సార్వత్రికి ఎన్నికలపై అమెరికా ప్రశంసలు కురిపించింది. ప్రపంచంలో భారత్ కంటే శక్తివంతమైన ప్రజాస్వామ్య దేశం మరొకటి లేదని కొనియాడింది. ఆ దేశ వైట్ హౌస్ జాతీయ భద్రతా సమాచార సలహాదారు జాన్ కిర్బీ ఓ ప్రశ్నకు సమాధానమిస్తూ భారత్‌ను ప్రశంసించారు.
దేశ వ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు తీవ్ర రూపంలో ఎండలు హడలెత్తిస్తున్నాయి. కాగా.. ఇంతటి ఎండల్లో ఒక చల్లటి వార్త బయటికొచ్చింది. రాబోయే రోజుల్లో కొన్ని చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు.. చాలా చోట్ల ప్రజలు వేడిగాలులను ఎదుర్కొనే అవకాశం ఉంది.. అయితే కాలక్రమేణా పరిస్థితి మెరుగుపడి వేడిగాలులు తగ్గుతాయని పేర్కొంది.