Warangal: వరంగల్ లోకసభ స్థానం ఎన్నికల ఓట్ల లెక్కింపుకు సర్వం సిద్ధమైంది. వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో ఓట్ల లెక్కింపుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా దూసుకెళుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 49 కేంద్రాల్లో కొనసాగుతున్న ఓట్ల లెక్కింపులో చాలాచోట్ల కాంగ్రెస్ అభ్యర్థులే ముందంజలో ఉన్నారు. నాలుగో రౌండ్ లోనూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. కొడంగల్‌లో ఆధిక్యంలో ఉన్నారు. నాలుగు రౌండ్లు పూర్తయ్యే �
తెలంగాణలో ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుంది. ఈ క్రమంలో మూడో రౌండ్ ఫలితాలు వెలువడయ్యాయి. కొడంగల్, కామారెడ్డిలో మూడో రౌండ్‌లో రేవంత్‌రెడ్డికి లీడ్ లో కొనసాగుతున్నారు. కొడంగల్‌లో 4159 ఓట్లు, కామారెడ్డిలో 2354 ఓట్ల ఆధిక్యంలో రేవంత్‌రెడ్డి ఉన్నారు.
తెలంగాణలో ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుంది. ఈ క్రమంలో రెండో రౌండ్ ఫలితాలు వెలువడయ్యాయి. రెండో రౌడ్‌లో గోషామహల్‌లో బీజేపీ అభ్యర్థి రాజాసింగ్‌కు 2800 ఓట్ల ఆధిక్యం ఉంది. మధిరలో రెండో రౌండ్ పూర్తయ్యేసరికి 4,137 ఓట్ల ఆధిక్యంలో భట్టి విక్రమార్క ఉన్నారు. కల్వకుర్తిలో బీఆర్ఎస్ అభ్యర్థికి 145 ఓట్ల ఆధిక్యంలో ఉండ�
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో మొదట పోస్టల్ బ్యాలెట్లను లెక్కింపు ప్రారంభమైంది. గతానికి భిన్నంగా ఈసారి ఓట్ల లెక్కింపలో పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
ఓట్ల లెక్కింపు సమయంలో పోలీసు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని డీజీపీ అంజనీకుమార్ ఆదేశించారు. ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకూ ఎప్పటికప్పుడు స్పెషల్ బ్రాంచ్‌కు తెలియజేయాలని చెప్పారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపుకు మొత్తం రెడీ అయింది. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలకు గానూ కాసేపట్లో ఓట్ల లెక్కింపు స్టార్ట్ అవుతుంది. ఓట్ల లెక్కింపుకు అధికార యంత్రాంగం అన్ని సిద్ధం చేసింది.
తెలంగాణలో గురువారం 119 నియోజకవర్గాల్లో పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. చెదురుమదురు ఘటనలు మినహా ఓటింగ్ ప్రశాంతంగా సాగింది. ఈ సందర్భంగా సీఈఓ వికాస్ రాజ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని తెలిపారు. పలుచోట్ల ఈవీఎంల మొరాయించాయి.. అవి తమ దృష్టికి రాగానే ఈవీఎంలను మార్చినట్లు