Andhra Pradesh Student Suicides: అవమాన భారం.. తల్లిదండ్రులు తిడతారనే భయం.. ఆ విద్యార్థుల ఉసురు తీశాయి. ఓ విద్యార్థి మద్యం తాగి వచ్చాడని అవమానించడంతో రైలు కింద పడ్డాడు. మరో విద్యార్థిని ట్యాబ్ దొంగిలించావని ఆరోపించడంతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో జరిగిన ఘటనలు కలకలం రేపుతున్నాయి. తిరుపతి జిల్లా ఎం.కొంగరవారిపల్లె ఉన్నత పాఠశాలలో సమీప గ్రామానికి చెందిన ఓ విద్యార్థి పదో తరగతి చదువుతున్నాడు. అతడు మద్యం తాగి పాఠశాలకు వచ్చాడు.…