ఓ స్థల వివాదంలో ఏడు కుటుంబాలను కుల బహిష్కరణ చేసిన ఘటన ఖమ్మం జిల్లా లో వెలుగు చూసింది. ఖమ్మం జిల్లా కల్లూరు మండలం చిన్న కోరుకొండి గ్రామపంచాయతీ లో కుల బహిష్కరణ వివాదం చర్చనీయాంశంగా మారింది. చిన్న కోరుకొండి గ్రామపంచాయతీలో గంతోటి.చిన్నప్ప(మాల సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి) తన స్థలానికి సరిహద్దుగా ఉన్న స్థలాన్ని అదే గ్రామానికి చెందిన వ్యక్తి వద్ద నుండి కొనుగోలు చేశారు. గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వమే ఆ స్థలంలో బావి…