బాలానగర్ లో తల్లి, ముగ్గురు పిల్లలు గతనెల 29న అదృశ్యం అయ్యారు. ఆ మిస్సింగ్ కేసును చేధించి వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు పోలీసులు. తల్లిని, ముగ్గురు పిల్లల్ని భర్తకు అప్పగించారు. మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కుత్బుల్లాపూర్ మార్కండేయ నగర్ లో రమేష్ మాధవి, వారికి ముగ్గురు పిల్లలతో నివాసముంటున్నారు. కూలి పని చేస్తూ జీవిస్తున్నారు.. గత నెల 23 వతేదీన భార్య పిల్లలతో రమేష్ యాదగిరి గుట్ట గుడికి వెళ్లారు..మరుసటి రోజున మాధవి (పుట్టినిల్లు) తల్లి ఇంటికి తన ముగ్గురు పిల్లలతో కలిసి సంగారెడ్డికి వెళ్లింది.
Read Also: Karnataka: కాంగ్రెస్ లీడర్ కొడుకు ఐసిస్ ఉగ్రవాది.. అరెస్ట్ చేసిన ఎన్ఐఏ
తిరిగి గతనెల 29వ తేదీన భర్త దగ్గరకు బయలుదేరి బాలానగర్ నర్సాపూర్ చౌరస్తా లో బస్సు దిగింది.. సాయంత్రం వరకు ఇంటికి రాకపోయేసరికి భర్త రమేష్ అత్తగారికి ఫోన్ చేసాడు. పుట్టింటి నుంచి బయలుదేరి వచ్చిందని, బస్సు ఎక్కించగా ఆమె పిల్లలతో సహా బాలానగర్ లో దిగింది అని సమాధానం ఇచ్చింది.. వారు కనిపించకపోవడంతో రమేష్ చుట్టు ప్రక్కల వెతికి పోలీసులకు ఫిర్యాదు చేసాడు.. కేసు నమోదు చేసుకున్న పోలీసుల దర్యాప్తులో మాధవి బెంగూళూరులో ఉన్నట్లు గ్రహించారు.. మాధవిని పిల్లలతో తీసుకువచ్చిన పోలీసులు భార్యభర్తలకు నచ్చచెప్పి, కౌన్సిలింగ్ ఇచ్చి భర్తకు అప్పచెప్పారు. కుటుంబ కలహాలతో మనస్తాపం చెందిన మాధవి 29 వతేదీ సాయంత్రం తెలిసిన వ్యక్తితో బెంగళూరుకు వెళ్లినట్లు తెలుస్తుంది.
Read Also:Earthquake: పసిఫిక్ సముద్రంలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ..