Pakistan: పాకిస్తాన్ ఇప్పటికే తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. అయితే, ఇప్పుడు ఆర్థిక సంక్షోభానికి అనుగుణంగా పాక్ ప్రజలు మరో ఇబ్బందిని ఎదుర్కొంటున్నారు. పాక్ కుటుంబాలు తమ ఆదాయంలో మూడింట రెండు వంతుల్ని ఆహారం, విద్యుత్ వంటి వాటికే చెల్లించాల్సి వస్తోంది. దీని కారణంగా విద్య, ఆరోగ్యం, దీర్ఘకాలిక అవసరాలకు ఖర్చు చేయలేని పరిస్థితి ఏర్పడిందని కొత్త ప్రభుత్వ సర్వే తెలియజేస్తోంది.
పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితి ఇప్పటికే దారుణంగా ఉంది. తీవ్ర నగదు కొరత, ఆర్థిక సంక్షోభంతో తల్లడిల్లుతోంది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ పలు ఆంక్షలు విధించడంతో పాక్ పరిస్థితి మరింత దిగజారింది. భారత్‌తో ఖయ్యానికి కాలు దువ్వుతున్న తరుణంలో ఆ దేశ ద్రవ్యోల్బణం కొండెక్కింది. ఇప్పటికే ఆహార పదార్ధాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. కేజీ చికెన్ ధర దాదాపు రూ. 800లకు చేరుకుంది. పాక్ ప్రజలు దారిద్ర్యం అనుభవిస్తున్నారు. ముందు ఇల్లు చక్కబెట్టుకోవడం మర్చిపోయి భారత్‌పై కారాలు మిరియాలు…