చిన్న పిల్లలకు కరోనా సోకుతుందా వస్తే వారిలో ఎలాంటి లక్షణాలు ఉంటాయి. కరోనా సోకిన పిల్లలను ఎలా గుర్తించాలి అనే విషయాలపై కేంద్ర ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలను రిలీజ్ చేసింది. మొదటిదశలో కరోనా కేవలం 4శాతం మంది పిల్లల్లో కనిపించగా, సెకండ్ వేవ్ సమయంలో 15 నుంచి 20శాతం మంది పిల్లల్లో కరోనా సోకినట్టు నిర్ధారణ జరిగింది. ఇది మూడో వేవ్ లో 80శాతం మంది పిల్లలకు ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉన్నట్టు నిపుణులు హెచ్చరిస్తున్నారు. జ్వరం, తలనొప్పి,…
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని మార్చేసింది. తప్పనిసరిగా ఆఫీస్‌కి వెళ్లి పనిచేసే ఉద్యోగులు కూడా కరోనా కారణంగా ఇంటినుంచే పనిచేయడం మొదలుపెట్టారు. ఎవరూ కూడా ఇంటి నుంచి బయటకు కదలడంలేదు. ఒకప్పుడు ఐటి రంగానికే పరిమితమైన ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇప్పుడు దాదాపుగా అన్ని రంగాలకు పాకింది. ఉపాద్యాయులు, ఉద్యోగులు అందరూ ఇంటి నుంచే పనిచేస్తున్నారు. వర్చువల్ విధానం ద్వారా పనిచేస్తున్నారు. మనదేశంలో కూడా ప్రస్తుతం ఇలానే జరుగుతున్నది. మంత్రుల సమావేశాలు, పాలనా పరమైన విధానాలు కూడా…
కరోనా కాలంలో ఎవరు ఏం చెప్పినా దానిని ఫాలో అవుతుంటారు. గత కొన్నిరోజులుగా కొన్ని రకాల చిట్కాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వేడినీళ్ళతో కరోనాకు చెక్ పెట్టొచ్చని వార్తలు వస్తున్నాయి. వేడి నీళ్లను తాగడం వలన, స్నానం చేయడం వలన కరోనా తగ్గిపోదని, 70 నుంచి 80 డిగ్రీల ఉష్ణోగ్రతలో మాత్రమే ఈ వైరస్ చనిపోతుందని నిపుణులు చెప్తున్నారు. ఇక వేడినీళ్లు తాగడం వలన శరీరంలో అవయవాలు యాక్టివ్ అవుతాయని, వేడినీళ్ళతో స్నానం చేయడం వలన కండరాల నొప్పులు తగ్గుతాయని, మెదడకు రక్తసరఫరా జరుగుతుందని నిపుణులు…
భారత్ నుంచి ఎక్కువ మంది పర్యటనల కోసం మాల్దీవులకు వెళ్తుంటారు. అలా మాల్థీవులకు వెళ్లే భారత పర్యాటకులపై ఆ దేశం తాత్కాలికంగా నిషేదం విధించింది. భారత్‌లో కరోనా వ్యాప్తి అధికంగా ఉండటంతో ఆ దేశం ఈ నిర్ణయం తీసుకుంది. భారత్‌తో పాటు దక్షిణాసియా దేశాల్లో పర్యటించిన పర్యాటకులపై కూడా మాల్ధీవులు నిషేదం విధించింది. అన్ని రకాల వీసాలపై ఈ నిషేదం వర్తిస్తుందని ఆ దేశ ఇమ్మిగ్రేషన్ అధికారులు ట్వీట్ చేశారు. మే 13 నుంచి ఈ నిషేదం…
ఈరోజు నుంచి తెలంగాణలో లాక్ డౌన్ అమలు జరుగుతున్న సంగతి తెలిసిందే. లాక్ డౌన్ అమలు జరుగుతుండటంతో ప్రయాణికులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం 10 గంటల వరకు ప్రయాణానికి అనుమతి ఉన్నది. ఉదయం 10 గంటల తర్వాత ఎవరిని బయటకు అనుమతించడం లేదు. బస్టాండ్లు బోసిపోయి దర్శనం ఇస్తున్నాయి. చాలా మందికి లాక్‌డౌన్‌కు సంబందించి నిబందనలు తెలియకపోడటంతో బస్టాండ్ వద్దకు చేరుకున్న ప్రయాణికులు బస్సలు లేకపోడంతో ఇబ్బందును పడుతున్నారు. వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాల…
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రేపటి నుంచి పదిరోజులపాటు రాష్ట్రంలో లాక్ డౌన్ అమలు చేయబోతున్నారు. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు నిత్యవసర వస్తువులు, మెడిసిన్ ఇతర వస్తువులు కొనుగోలు చేయడానికి అనుమతులు ఇచ్చారు. ఉదయం 10 గంటల తరువాత ఎవరూ బయటకు రాకూడదు. లాక్‌డౌన్ మినహాయింపులు ఉన్న అత్యవసర సర్వీసులు, లాక్ డౌన్ పాసులు ఉన్న వారికి మాత్రమే అనుమతులు ఉంటాయి. ఇక, వేటికి పూర్తి స్థాయిలో మినహాయింపులు…
ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన కాసేపట్లో తెలంగాణ కేబినెట్ సమావేశం కాబోతున్నది. తెలంగాణ కేబినెట్ లో కీలక విషయాల గురించి చర్చించబోతున్నారు. నైట్ కర్ఫ్యూ సమయంలో జరిగిన పరిణామాలు, కరోనా వైరస్ వ్యాప్తి, లాక్ డౌన్ విధిస్తే వచ్చే నష్టాలు, ఇబ్బందులు తదితర విషయాల గురించి ఈ కేబినెట్ మీటింగ్ లో చర్చించబోతున్నారు. ఈనెల 13 వ తేదీన రంజాన్ కావడంతో రంజాన్ తరువాత నుంచి లాక్ డౌన్ విధిస్తారని వార్తలు వస్తున్నాయి. ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉన్నది అనే…
దేశంలో కరోనా మహమ్మారి రోజు రోజుకు ఉదృతం అవుతున్న సంగతి తెలిసిందే. భారత్ ను ఆదుకోవడానికి పలు దేశాలు ముందుకు వచ్చాయి. అంతర్జాతీయ సంస్థలు. బహుళ జాతీయ కంపెనీలు ముందుకు తమవంతు సహాయం ప్రకటిస్తున్నాయి. ఇందులో భాగంగా ప్రముఖ సోషల్ మీడియా ట్విట్టర్ 110 కోట్ల రూపాయల సహాయాన్ని ప్రకటించింది. ఈ మొత్తాన్ని భారత్ లోని కేర్, ఎయిడ్ ఇండియా, సేవ ఇంటర్నేషనల్ సంస్థలకు పంపిణి చేసింది. ఈ మూడు సంస్థలు ఈ నిధులను భారత్ లో కరోనా మహమ్మారి కోసం…
రాష్ట్రంలో కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతోంది. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో కేసులు తక్కువగా నమోదవుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటె,ప్రస్తుత కరోనా పరిస్థితులపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరుగుతున్నది. తెలంగాణలో కరోనా పరీక్షలు తక్కువగా చేస్తున్నారని హైకోర్టు ఇప్పటికే ఆగ్రహం వ్యక్తం చేసింది. తాజాగా మరోసారి ఈరోజు హైకోర్టు తెలంగాణ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ధిక్కరణ నోటీసులు ఇస్తామని హెచ్చరించింది. సరిహాద్దుల్లో అంబులెన్స్ ను అడ్డుకోవడంపై కూడా…
దేశంలో కరోనా కేసులు పెరిగిపోతుండటంతో వ్యాక్సిన్ ను వేగవంతం చేశారు. ప్రస్తుతం దేశంలో మూడు వ్యాక్సిన్‌లు అందుబాటులోకి వచ్చాయి. కోవిషీల్డ్, కోవాగ్జిన్ వ్యాక్సిన్‌లు ఇండియాలో తయారవుతుండగా, స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ రష్యా నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. హైదరాబాద్ కు చెందిన భారత్ బయోటెక్ సంస్థ కోవాగ్జిన్ ను తయారు చేసింది. ఈ వ్యాక్సిన్ ను ఇప్పుడు రాష్ట్రాలకు నేరుగా సరఫరా చేసేందుకు భారత్ బయోటెక్ సిద్దం అయింది. మే 1 వ తేదీ నుంచి దేశంలోని 14…