నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం లో ఆనందయ్య నాటు మందు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. నాటు మందుతో కరోనా తగ్గిపోతుందని ప్రచారం జరగడంతో పెద్ద ఎత్తున ఆనందయ్య నాటు మందు కోసం కృష్ణపట్నం చేరుకున్నారు ప్రజలు. అయితే, తోపులాట జరగడంతో మందు పంపిణీని నిలిపివేశారు. ఈ మందుకు ఎంతవరకు శాస్త్రీయత ఉన్నది అని తెలుసుకోవడానికి ఆయుష్ శాఖ, ఐసీఎంఆర్ శాస్త్రవేత్తలు పరిశోధన చేయబోతున్నారు. ఇప్పటికే ఆయుష్ అధికారులు మందును పరిశీలించారు. ఐసీఎంఆర్ కూడా పరిశోధనలు చేయబోతున్నది. ఈ మందుకు శాస్త్రీయత…
మే 13 నుంచి తెలంగాణలో లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. ఈనెల 30 వరకు లాక్ డౌన్ ను పొడిగించిన సంగతి తెలిసిందే. అయితే, తెలంగాణలో కేసులు తక్కువగా నమోదవుతున్నా, చుట్టుపక్కల రాష్ట్రాల్లో కేసులు పెరుగుతుండటంతో లాక్ డౌన్ ను మరింత కఠినంగా అమలు చేసేందుకు తెలంగాణ పోలీస్ శాఖ సిద్ధం అయ్యింది. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు లాక్ డౌన్ సడలింపులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈరోజు నుంచి సరుకు రవాణా వాహనాలకు…
కరోనా సెకండ్ వేవ్ భారత్‌లో కల్లోలం సృష్టిస్తోన్న సమయంలో.. భారత్‌లో కొత్త వేరియంట్లు పుట్టుకొచ్చాయంటూ ప్రచారం జరిగింది.. ముఖ్యంగా.. కరోనా బీ.1.617 వేరియంట్‌ను భారత్ వేరియంట్‌గా పలు కథనాలు వచ్చాయి.. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా సంస్థలను కీలక ఆదేశాలు జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం.. డబ్ల్యూహెచ్‌వో తమకు సంబంధించిన ఏ నివేదికలోనూ భారత్ వేరియంట్ అనే పదాన్ని వాడలేదని, ఇది పూర్తిగా తప్పుడు సమాచారమంటూ ఆయా సంస్థలకు కేంద్ర ఐటీ శాఖ లేఖ రాసింది. ఇక,…
దేశంలో కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తోంది. కరోనా మహమ్మారి కేసులు భారీగా పెరుగుతుండటంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. కరోనా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. హోమ్ ఐసోలేషన్ లో ఉన్న సమయంలో ఎలాంటి నిబంధనలు పాటించాలనే దానిపై కేంద్రం ఇప్పటికే మార్గదర్శకాలు విడుదల చేసింది. హోమ్ ఐసోలేషన్ లో ఉన్న వ్యక్తులు తప్పనిసరిగా డబుల్ మాస్క్ ధరించాలి. కరోనా రోగి తుమ్మినప్పుడు అతని తుంపర్లు ఆరు అడుగుల దూరం వరకు ప్రసరిస్తాయి. అదే విధంగా మైక్రో తుంపర్లు…
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్నది. కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తున్నది. ఏ వ్యక్తికి ఎప్పుడు కరోనా సోకుతుందో తెలియని పరిస్థితి. కరోనా మహమ్మారి బారినుంచి కోలుకుంటాడో లేదో చెప్పలేని పరిస్థితి. పెళ్ళైనా వారు, పెళ్లి కానివారు, పెళ్లిళ్లు చేసుకోవడానికి సిద్దమైన వారు ఇలా ఎవర్ని కరోనా మహమ్మారి వదలడం లేదు. మరో మూడు రోజుల్లో పెళ్లి ఉందని అనగా, పెళ్లి కుమారుడు కరోనాతో బలయ్యాడు. ఈ సంఘటన విజయనగరం జిల్లా సాలూరులో జరిగింది. సాలూరుకు చెందిన మనోహర్ అనే వ్యక్తి…
దేశంలో కరోనా మహమ్మారి కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో అత్యధిక కేసులు నమోదవుతున్న సంగతి తెలిసిందే. తమిళనాడులో ప్రస్తుతం లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేస్తున్నప్పటికీ కేసులు రోజుకు 30 వేలకు పైగా నమోదవుతున్నాయి. అయితే, చెన్నైలో ఈ కేసులు కొద్దిమేర తగ్గుముఖం పట్టాయి. చెన్నై నగరంలో ప్రస్తుతం 50 వేల వరకు పాజిటివ్ కేసులు ఉన్నట్టు గణాంకాలు చెప్తున్నాయి. దీంతో నగరంలోని కరోనా…
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. కేసులతో పాటుగా మరణాల సంఖ్య కూడా భారీ స్థాయిలో నమోదవుతున్నాయి. రోజుకు నాలుగు వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. సామాన్యుల నుంచి రాజకీయ నాయకుల వరకు ఎవరిని కరోనా వదలడం లేదు. కరోనాతో అనేక మంది రాజకీయ ప్రముఖులు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఇటీవలే ఉత్తర ప్రదేశ్ రెవిన్యూ శాఖ మంత్రి విజయ్ కశ్యప్ మృతి చెందిన సంగతి తెలిసిందే. కాగా, తాజాగా రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి జగన్నాథ్ పహాడియా కరోనాతో…
టెస్ట్… ట్రేస్… ట్రీట్ కరోనా మహమ్మారికి చెక్ పెట్టేందుకు ఈ మూడు విధానాలను పాటిస్తున్నారు. అయితే, దేశంలో కొన్ని రాష్ట్రాల్లో లాక్ డౌన్, కర్ఫ్యూ విధించడం వలన చాలా రాష్ట్రాల్లో కరోనా టెస్టుల సంఖ్య కొంతమేర తక్కువగా ఉంటోంది. అంతేకాదు, చాలా ప్రాంతాల్లో కరోనా టెస్టులు ఎలా చేయించుకోవాలో తెలియక ఇబ్బందులు పడుతున్నారు. కాగా, ఇప్పుడు ఇండియాలో సొంతంగా ఇంట్లోనే కరోనా టెస్టులు చేసుకోవడానికి వీలు ఉండేవిధంగా ఓ కిట్ ను రూపొందించారు. ఈ కిట్ కు ఐసిఎంఆర్…
ఇండియాలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్న సమయంలో దేశంలో ఆంక్షలు కఠినంగా అమలు జరుగుతున్నాయి. కొన్ని దేశాలు భారత ప్రయాణికులపై ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ఈ లిస్టులో ఇప్పుడు సూడాన్ చేరిపోయింది. భారత ప్రయాణికులపై రెండు వారాలపాటు ఆంక్షలు విధించింది. భారత దేశంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో సుడాన్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. భారత్ తో పాటుగా ఈజిప్టు, ఇథియోపియా దేశాల ప్రయాణికులపై కూడా సుడాన్ ప్రభుత్వం ఆంక్షలు విధించింది.