ఇండియాలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. అయితే, నిన్నటి కంటే స్వల్పంగా కేసులు తగ్గాయి. తాజాగా దేశంలో 3,29,942 కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,29,92,517కి చేరింది. ఇందులో 1,90,27,304 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 37,15,221 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనాతో 3,876 మంది మృతి చెందారు. దీంతో ఇండియాలో ఇప్పటివరకు కరోనాతో 2,49,992…
కరోనా మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందుతున్న తరుణంలో వైరస్ గాలిలో ఎంత దూరం వరకు వ్యాపించి ఉంటుంది. ఎంత తీవ్రత ఉంటుంది అనే అంశాలపై అనేక మంది అనేక సమాధానాలు ఇచ్చారు. అయితే, అమెరికాకు చెందిన అంటువ్యాధుల నియంత్రణ సంస్థ మరోసారి దీనికి సమాధానం తెలిపింది. కరోనా రోగి నుంచి వైరస్ మూడు నుంచి ఆరు అడుగుల దూరం వరకు వ్యాపించి ఉంటుందని, గాలి వెలుతురు సరిగా లేని గదిలో ఆరు అడుగుల కంటే ఎక్కువ దూరం వరకు…
దేశంలో కరోనా మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందుతోంది. కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు ఎవర్ని కరోనా వదలడం లేదు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ముఖ్యమంత్రులు సైతం కరోనా బారిన పడుతున్నారు. తాజాగా దేశంలో మరో ముఖ్యమంత్రి కరోనా బారిన పడ్డారు. పుదుచ్చేరి సీఎం రంగస్వామి కరోనా బారిన పట్టారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో పుదుచ్చేరిలో అన్నాడీఎంకే కూటమి విజయం సాధించింది. ఆ కూటమి నుంచి రంగస్వామిని ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు. నాలుగురోజుల…
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని భయపెడుతున్న సంగతి తెలిసిందే. కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. కరోనా మహమ్మారి నుంచి బయటపడేందుకు కొన్ని దేశాల్లో టీకా అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే. మోడెర్నా కంపెనీ కరోనా వ్యాక్సిన్ ను తయారు చేసింది. ఈ వ్యాక్సిన్ ప్రస్తుతం అమెరికాతో సహా కొన్ని దేశాల్లో ఉపయోగిస్తున్నారు. అయితే, కరోనా మహమ్మారిపై మోడెర్నా సీఈవో కీలక వ్యాఖ్యలు చేశారు. మరో ఆరు నెలల్లో కొత్త స్ట్రెయిన్ ను ఎదుర్కోవడానికి అందరూ సిద్ధంగా ఉండాలని,…
దేశంలో మహమ్మారి కేసులు రోజు రోజుకు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. రోజుకు మూడున్నర లక్షలకు పైగా కేసులు నమోదవుతున్న తరుణంలో కేసులను కంట్రోల్ చేయకుంటే ఆరోగ్యవ్యవస్థ కుప్పకూలే అవకాశం ఉన్నది. దీంతో రాష్ట్రాల్లోని కోర్టులు కరోనా మహమ్మారి విషయంలో జోక్యం చేసుకుంటున్నాయి. కరోనా మహమ్మారిని కంట్రోల్ చేయడానికి తీసుకుంటున్న చర్యలను వివరించాలని ఆదేశాలు జారీ చేస్తున్నాయి. తాజాగా, బీహార్ హైకోర్టు ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది. బీహార్ లో రోజువారీ కేసులు పెరుగుతుండటంతో పాటుగా, హైకోర్టు కూడా కీలక ఆదేశాలు జారీ…
కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తుండడంతో.. కొన్ని రాష్ట్రాలు లాక్‌డౌన్‌కు వెళ్తే.. మరికొన్ని రాష్ట్రాలు వీకెండ్ లాక్‌డౌన్, మినీ లాక్‌డౌన్, నైట్ కర్ప్యూ.. ఇలా పేరు ఏదైనా.. కఠిన చర్యలకు పూనుకుంటున్నాయి. ఇక, కోవిడ్ సేకవండ్ వేవ్ నేపథ్యంలో మంత్రాలయంలోని రాఘవేంద్ర స్వామి మఠం కీలక నిర్ణయం తీసుకుంది.. రేపటి (మే 1వ తేదీ) నుంచి మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మఠంలో భక్తులకు దర్శనం నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నారు.. భక్తులు ఎవరూ దర్శనానికి రాకూడదని మఠం అధికారులు కోరారు..…
కేరళలో కరోనా కేసులు రోజు రోజుకు భారీ స్థాయిలో నమోదవుతున్నాయి. రోజువారీ కేసులు 30 వేలకు పైగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. మొదటి వేవ్ ను సమర్ధవంతంగా ఎదుర్కొన్న కేరళ, సెకండ్ వేవ్ ధాటికి విలవిలలాడిపోతుంది. కరోనా నుంచి బయటపడేందుకు ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం పోలీసులు సిద్ధమయ్యారు. ఇటీవలే బాగా పాపులర్ అయిన ఎంజాయి ఎంజామి అనే సాంగ్ ను కరోనా మహమ్మారికి తగిన విధంగా రీమిక్స్ చేసి దానికి తగిన విధంగా పోలీసులు స్టెప్పులు వేసి సోషల్…
కరోనా మహమ్మారి ఇప్పటికే ఎంతోమంది ప్రముఖుల ప్రాణాలు తీసింది.. పోలీసుల విభాగంలోనూ పెద్ద ఎత్తున కిందిస్థాయి నుంచి పై స్థాయి వరకు అధికారులు ప్రాణాలు కోల్పోయారు.. తాజాగా.. కౌంటర్ ఇంటెలిజెన్స్ ఎస్పీ రామ్ ప్రసాద్ కరోనా మృతి చెందారు. పోలీస్ శాఖలో సౌమ్యుడిగా, సమర్ధవంతమైన అధికారిగా పేరుపొందిన ఆయన.. కరోనా పాజిటివ్‌గా తేలడంతో.. గత 10 రోజులుగా విజయవాడలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.. అయితే, ఇవాళ ఆయన పరిస్థితి మరింత విషమించి కన్నుమూశారు.. కృష్ణ జిల్లా…
తెలంగాణలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. కరోనాను కట్టడి చేసేందుకు నిన్నటి నుంచి నైట్ కర్ఫ్యూ విధించారు. ఇక ఇదిలా ఉంటె, తెలంగాణ ప్రభుత్వం తాజాగా కరోనా బులెటిన్ ను రిలీజ్ చేసింది. ఈ బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో కొత్తగా 6,542 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 3.67 లక్షలకు చేరింది. ఇందులో 3.19 లక్షల మంది డిశ్చార్జ్ కాగా, 46,488 కేసులు యాక్టివ్ గా…
తెలంగాణ ప్రభుత్వం కరోనా కట్టడి విషయంలో కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈరోజు నుంచి రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ విధించింది. అయితే, ఈరోజు రాత్రి నుంచి మే 1 వ తేదీ వరకు ఈ నైట్ కర్ఫ్యూ అమలులో ఉంటుంది. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమలులో ఉంటుంది. కర్ఫ్యూ అమలు సమయంలో అత్యవసర సేవలకు మాత్రమే అనుమతులు ఉన్నాయి. ఎల్పీజీ, సిఎన్జీ, గ్యాస్, కోల్డ్ స్టోరేజీలు, గోడౌన్లు యధావిధిగా నడుస్తాయి. …