ఢిల్లీలో కరోనా మహమ్మారి కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. కనిష్టస్థాయికి కేసులు చేరుకోవడంతో లాక్‌డౌన్‌లో సడలింపులు ఇవ్వడం మొదలుపెట్టారు. లాక్‌డౌన్ సడలింపుల సమయంలో కూడా కేసులు కేసులు పెద్దగా నమోదుకావడంలేదు. దీంతో మరిన్ని సడలింపులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి 50శాతం సీటింగ్ కెపాసిటితో రెస్టారెంట్లు, ప్రైవేట్ కార్యాలయాలకు అనుమతులు మంజూరు చేశారు. పెళ్లిళ్లు, అంత్యక్రియలకు 20 మందికంటే ఎక్కువ మందికి అనుమతి లేదని ప్రకటించింది ప్రభుత్వం. ఇక ఢీల్లీలో పాఠశాలలు, సినిమా హాల్స్ మూసే…
తిరుపతి స్విమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కరోనా రోగి ఆత్మహత్యకు పాల్పడింది. నెల్లూరు జిల్లాలో నర్స్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న జయమ్మ అనే మహిళ బ్లాక్ ఫంగస్ బారిన పడింది. దీంతో ఆమెను తిరుపతి స్విమ్స్‌లో జాయిన్ చేసి చికిత్స అందిస్తున్నారు. తిరుపతి పద్మావతి కరోనా వార్డులో చికిత్స పొందుతున్న జయమ్మ, మెడికల్ వార్డులోనే ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. దీంతో వార్డులో మిగతా రోగుల్లో భయాంధోళనలకు గురయ్యారు. బ్లాక్ ఫంగస్ సోకిందనే మనస్థాపంతో ఆత్మహత్యకు పాల్పడ్డారా లేదంటే మరేమైనా…
చైనాలోని వూహాన్ నగరంలో మొదలైన కరోనా మహమ్మారి ప్రపంచం మొత్తాన్ని అతలాకుతలం చేసింది. ఆర్ధికంగా ముందుకు వెళ్తున్నాయని అనుకున్న దేశాలు కరోనాతో ఒక్కసారిగా కుదేలయ్యాయి. కరోనాపై చైనా ముందస్తుగా సమాచారం ఇవ్వలేదని, కరోనా వైరస్ వూహాన్ ల్యాబ్ నుంచే బయటకు వచ్చిందని అమెరికాతో సహా ప్రపంచదేశాలు ఆరోపిస్తున్నాయి. ఇకపోతే, చైనా పరిశోధకులు మరో భయంకరమైన నిజాన్ని బయటపెట్టారు. 2019 మే నెల నుంచి గత ఏడాది నవంబర్ వరకు అడవిలో సంచరించే గబ్బిలాల నుంచి నమూనాలను సేకరించి…
కరోనా మహమ్మారి కేసులు తగ్గుముఖం పడుతున్న దాని ప్రభావం ఏ మాత్రం తగ్గడంలేదు. రోజువారి మరణాల సంఖ్య పెరుగుతూనే ఉన్నది. నిన్న ఒక్కరోజే కరోనాతో 6,148 మంది మృతి చెందారు అంటే వైరస్ తీవ్రత ఏ స్థాయిలో ఉన్నదో అర్ధం చేసుకోవచ్చు. అన్‌లాక్ ప్రక్రియ అమలు జరుగుతుండటంతో ప్రజలు బయటకు వస్తున్నారు. సొంత వాహనాల్లో ప్రయాణించేవారికంటే, సొంత వాహనాల్లో ప్రయాణం చేసేవారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఏ వాహనంలో ప్రయాణం చేస్తే ముప్పు ఎంత ఉంటుంది అనే…
దేశంలో కరోనా ఉదృతి క్రమంగా తగ్గుతున్న సంగతి తెలిసిందే. 4 లక్షల నుంచి లక్ష దిగువకు కేసులు నమోదవుతుండగా, మరణాల సంఖ్య కూడా బాగా తగ్గింది. 4 వేల నుంచి రెండు వేలకు తగ్గిపోయింది. అయితే, నిన్నటి డేటా ప్రకారం ఇండియాలో 93,896 కేసులు నమోదవ్వగా, మరణాల సంఖ్యమాత్రం ఒక్కసారిగా భారీగా పెరిగింది. దేశంలో 24 గంటల్లో 6,138 మరణాలు సంభవించినట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఇండియాలో మొత్తం 2,91,82,072 కేసులు నమోదవ్వగా, మొత్తం మరణాల సంఖ్య 3,59,695…
ఇండియాలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గతంలో నాలుగు లక్షలకు పైగా నమోదవ్వగా, ఇప్పుడు ఆ కేసుల సంఖ్య లక్షకు తగ్గిపోయింది. తాజాగా కేంద్రం కరోనా బులిటెన్‌ను రిలీజ్ చేసింది. ఈ బులిటెన్ ప్రకారం దేశంలో కొత్తగా 92,596 కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 2,90,89,069కి చేరింది. ఇందులో 2,75,04,126 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 12,31,415 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇకపోతే, గడిచిన 24 గంటల్లో ఇండియాలో…
కరోనా కొత్త కేసులు భారీగా తగ్గడంతో ఇప్పటికే లాక్‌డౌన్‌కు ముగింపు పలికి అన్‌లాక్‌కు వెళ్లిపోయింది దేశ రాజధాని ఢిల్లీ.. తాజాగా పాజిటివ్ కేసులు మరింత తక్కువగా నమోదు అయ్యాయి… ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కోవిడ్ బులెటిన్ ప్రకారం… గత 24 గంటల్లో కేవలం 316 కొత్త కేసులు వెలుగు చూశాయి.. మరో 41 మంది కరోనాబారినపడి మృతిచెందారు.. ఇదే సమయంలో కోలుకున్న కోవిడ్ బాధితుల సంఖ్య 521కు పెరిగింది.. యాక్టివ్ కేసులు…