దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నా, మహారాష్ట్రలో మాత్రం కేసులు తగ్గడంలేదు. మహారాష్ట్రలోని 8 జిల్లాల్లో కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. కొల్హాపురి, సాతారా, పాల్ఘాట్, రాయ్‌గడ్, సంధూదుర్గ్, రత్నగిరి, పూణే రూరల్, సాంగ్లీ జిల్లాల్లో కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తొంది. కరోనా కేసులతో పాటుగా అటు మరణాల సంఖ్య కూడా ఎక్కువగా నమోదవుతున్నాయి. ఆదివారం రోజున 8,535 కేసులు నమోదవ్వగా 158 మరణాలు నమోదయ్యాయి. 8 జిల్లాల నుంచే అధికంగా కేసులు వస్తుండటంతో ప్రభుత్వ యంత్రాంగం…
ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా మహమ్మారి ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా ప్రభావం చూపుతున్నది. కొన్ని చోట్ల వ్యాక్సిన్ తీసుకున్నా కరోనా సోకుతుండటం ఆందోళన కలిగిస్తున్నది. కరోనాకు చెక్ పెట్టాలి అంటే వ్యాక్సిన్ ఒక్కటే మార్గం అని ప్రపంచ దేశాలు ప్రగాఢంగా విశ్వసిస్తున్నాయి. పెద్ద ఎత్తున వ్యాక్సిన్‌లు అందిస్తున్నారు. అయినప్పటికీ, కరోనా మహమ్మారి అదుపులోకి రావడంలేదు. తగ్గినట్టే తగ్గి తిరిగి కొత్తగా వ్యాపిస్తున్నది. ఒక్కో దేశంలో ఒక్కో పేరుతో కరోనా వేరియంట్లు విజృంభిస్తున్నాయి. అయితే, బెల్జియంకు చెందిన…
కరోనా మహమ్మారి నుంచి యావత్ ప్రపంచ దేశాలు ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాయి. వ్యాక్సినేషన్ ప్రక్రియను, నిబంధనలను పక్కాగా అమలు చేయడం వలనే కరోనా రక్కసి కోరల నుంచి దేశాలు బయటపడుతున్నాయి. కరోనా నుంచి బయటపడేందుకు బ్రిటన్ లో అత్యధిక కాలం లాక్‌డౌన్ ను అమలు చేశారు. జులై 19 తరువాత ఆంక్షలను ఎత్తివేసే యోచనలో బ్రిటన్ ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం. మాస్క్ వాడకం విషయంపై కూడా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుందని నిపుణులు చెబుతున్నారు. Read: బన్నీకి…
తెలంగాణలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. కేసులతో పాటుగా మరణాల సంఖ్య కూడా తగ్గుముఖం పట్టడంతో రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. వేగంగా వ్యాక్సిన్‌ను అందిస్తుండటంతో కేసులు తగ్గుతున్నాయి. తాజాగా రాష్ట్ర ఆరోగ్యశాఖ కరోనా బులిటెన్ ను విడుదల చేసింది. ఈ బులిటెన్ ప్రకారం రాష్ట్రంలో కొత్తగా 605 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం ఇప్పటి వరకు 6,26,690 కేసులు నమోదయ్యాయి. ఇందులో 6,11,035 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 11,964 కేసులు యాక్టీవ్‌గా…
కరోనా మహమ్మారి నుంచి బయటపడాలి అంటే వ్యాక్సిన్ తీసుకోవడం ఒక్కటే మార్గం. వ్యాక్సిన్‌తీసుకోవడం వలన శరీరంలో యాంటీబాడీలు ఉత్పత్తి అవుతాయి. ఒకసారి వ్యాక్సిన్ తీసుకుంటే కనీపం ఆరునెలలపాటు యాంటీబాడీలో శరీరంలో ఉత్పత్తి అవుతాయి. కానీ, చాలామంది అపోహల కారణంగా, వ్యాక్సిన్ తీసుకోవడానికి ముందుకు రావడంలేదు. వ్యాక్సిన్ తీసుకుంటే ఏమైతుందో అనే భయంతో వెనకడుగు వేస్తున్నారు. కానీ, టీకాలు తీసుకోక పోవడం వలన వారికే కాకుండా వారి చుట్టు ఉన్న వారికి కూడా ముప్పు ఏర్పడే అవకాశం ఉంటుందని…
కరోనా కేసులు తగ్గుతున్నా ముప్పు మాత్రం పూర్తిగా తగ్గిపోలేదు. ముప్పు ప్రమాదం ఇంకా పొంచి ఉన్నది. దీంతో వ్యాక్సిన్ పట్ల ప్రజల్లో అవగాహన కల్పించేందుకు చెన్నైకు చెందిన గౌతమ్ అనే వ్యక్తి చెన్నై మునిపల్ కార్పోరేషన్‌తో కలిసి వినూత్నంగా ప్రచారం చేయడం ప్రారంభించారు. ప్రజల్లో వ్యాక్సిన్ పట్ల, భయాన్ని అపోహలు తొలగించి అందరూ వ్యాక్సిన్ తీసుకోవాలని ఆటోలో ప్రయాణం చేస్తూ అవగాహన కల్పిస్తున్నాడు. అయితే, మాములుగా ఆటోలో ప్రయాణం చేస్తూ ప్రచారం చేస్తే ఎవరు పట్టించుకుంటారు. అందుకే…
హైదరాబాద్ గ్రేటర్ పరిధిలో కరోనా వ్యాప్తి క్రమంగా తగ్గుతుంది. గడచిన 24 గంటల్లో తెలంగాణలో 1,08,954 కరోనా పరీక్షలు నిర్వహించగా, 848 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 98 మందికి కరోనా నిర్ధారణ అయింది. ఇటీవల కాలంలో గ్రేటర్ హైదరాబాదులో ఇదే తక్కువ. 1,114 మంది కరోనా నుంచి కోలుకోగా 6 గురు మరణించారు. తెలంగాణలో ఇప్పటివరకు 6,26,085 పాజిటివ్ కేసులు నమోదు కాగా… 6,09,947 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 12,454 మంది చికిత్స పొందుతున్నారు.…
కరోనా మహమ్మారిలో అనేక వేరియంట్‌లు యావత్ దేశాలను అతలాకుతలం చేస్తున్నది. ఆల్ఫా వేరియంట్ అత్యధికంగా 172 దేశాల్లో వ్యాపించగా, దాని తరువాత డెల్టా వేరియంట్ 100కు పైగా దేశాల్లో వ్యాప్తిచెందినట్టు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ స్పష్టంచేసింది. సెకండ్ వేవ్‌లో డెల్టా వేరియంట్ కారణంగా ఎక్కువ కేసులు, మరణాలు సంభవించాయని, ఈ వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతూ ఆందోళన కలిగిస్తోందని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ పేర్కొన్నది. రాబోయో రోజుల్లో ఈ వేరియంట్ మిగతా వేరియంట్‌లను డామినేట్ చేసే అవకాశం…
హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే భారత్ బయోటెక్ రూపొందించిన కోవాగ్జిన్ కరోనా వ్యాక్సిన్‌కు కితాబు ఇచ్చింది అమెరికా… కరోనాతో పాటు తాజాగా.. భారత్‌లో వెలుగుచూసిన ఆల్ఫా, డెల్టా వేరియంట్లపై కూడా కోవాగ్జిన్ వ్యాక్సిన్ సమర్థవంతంగా పని చేస్తున్నట్లు తేలింది. కోవాగ్జిన్‌పై టీకాలపై అధ్యయనం నిర్వహించిన అమెరికాలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్… ఎస్‌ఏఆర్‌ఎస్-సీవోవీ-2 ఆల్ఫా, డెల్టా వేరియంట్లను కోవాగ్జిన్ చాలా ప్రభావవంతంగా ఎదుర్కొంటుందని తేల్చింది.. ఈ వ్యాక్సిన్ తీసుకున్న కొందరి నమూనాలను సేకరించి అధ్యయనం చేసిన ఎన్‌ఐహెచ్.. ఆల్ఫా…