కరోనా నుంచి బయట పడేందుకు వ్యాక్సిన్ ఒక్కటే మార్గం అని ప్రపంచంలోని అన్ని దేశాలు ప్రకటించిన సంగతి తెలిసిందే. అతి తక్కువ కాలంలోనే అనేక వ్యాక్సిన్లను అందుబాటులోకి వచ్చాయి. చాలా దేశాల్లో వ్యాక్సినేషన్ వేగంగా అమలు చేస్తున్నారు. ఇండియాలో వేగంగా వ్యాక్సిన్ అందిస్తున్నారు. సెకండ్ వేవ్ సమయంలో కేసులు, మరణాలు ఏవిధంగా ఉన్నాయో చెప్పక్కర్లేదు. ఇండియాలో ప్రస్తుతం మూడు వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఒకటి. సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఈ వ్యాక్సిన్‌ను…
రాష్ట్రంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. నిన్న ఉదయం 9 గంటల నుంచి ఈరోజు ఉదయం 9 గంటల వరకు 61,298 శాంపిల్స్‌ను పరీక్షించగా, 1540 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 19,57,932కి చేరింది. ఇందులో 19,23,675 మంది కోలుకొని డిశ్చార్జ్ అయినట్టు బులిటెన్‌లో పేర్కొన్నారు. 24 గంటల్లో రాష్ట్రంలో 2,304 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇకపోతే, రాష్ట్రంలో ప్రస్తుతం 20,965…
దేశవ్యాప్తంగా 18 ఏళ్లు వయసుపైబడిన వారికి కరోనా టీకాలు అందిస్తున్నారు. ప్రస్తుతం దేశంలో కేసుల సంఖ్య తక్కువగా నమోదవ్వడానికి ఇదికూడా ఒక కారణమని నిపుణులు చెబుతున్నారు. అయితే, మూడో వేవ్ ముప్పు పొంచి ఉందని వార్తలు వస్తున్న నేపథ్యంలో 18 ఏళ్లలోపున్న పిల్లలకు వీలైనంత త్వరగా వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. వచ్చే నెలలోనే టీకా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని సమాచారం. ఈరోజు బీజేపీ ఎంపీలతో పీఎం మోడీ, కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్…
కరోనా డెల్టా వేరియంట్ మరింత డేంజర్‌గా మారుతోంది. డెల్టా వేరియంట్ సోకిన వ్యక్తికి దగ్గరగా వెళ్లినా సరే.. ఇన్ఫెక్షన్ సోకుతుందని తేల్చారు శాస్త్రవేత్తలు. వ్యాక్సిన్ తీసుకున్నవారికి కూడా ఈ వేరియంట్ సోకుంది. కరోనా వ్యాప్తి ప్రారంభంలో వైరస్ సోకిన వ్యక్తి దగ్గరికి వెళ్లినప్పటినుంచి ఇన్ఫెక్షన్ బారిన పడటానికి మధ్య సరాసరి ఆరు రోజుల వ్యవధి ఉండేది. కానీ డెల్టా వేరియంట్ విషయంలో ఇది నాలుగు రోజులకు పడిపోయిందంటున్నారు శాస్త్రవేత్తలు. టీకాలు తీసుకున్న వారికి సైతం డెల్టా వేరియంట్…
ఇండియాలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా దేశంలో కొత్తగా 39,361 కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనాతో 35,968 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు ఇండియాలో కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 3,05,79,106కి చేరింది. ఇక గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనాతో 416 మంది మృతి చెందినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ బులిటెన్‌లో పేర్కొన్నది. దేశంలో ఇప్పటి వరకు కరోనాతో 4,20,967 మంది మృతి చేందారు. ఇక దేశంలో 4,11,189…
కరోనా ఫస్ట్ వేవ్ ముగిసిపోయి.. సెకండ్ వేవ్ ఇంకా కొనసాగుతూనే ఉంది.. మరోవైపు థర్డ్ వేవ్ కూడా ప్రారంభదశలో ఉందంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) హెచ్చరికలు జారీ చేసింది.. ఈ సమయంలో.. సీరం సర్వేలో ఆసక్తికర అంశాలు వెలుగుచూశాయి.. తెలంగాణలో ఇటీవల నాలుగో దఫా సీరం సర్వేని నిర్వహించింది ఐసీఎంఆర్ అనుబంధ సంస్థ నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ … ఆ సర్వేలో 60 శాతం మందిలో కోవిడ్ యాంటీ బాడీలను గుర్తించినట్టు ప్రకటించింది.…
ఇండియాలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. తాజాగా కేంద్రం రిలీజ్ చేసిన బులిటెన్ ప్రకారం దేశంలో కొత్తగా 35,342 కేసులు…482 మరణాలు నమోదయ్యాయి. దీంతో దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,12,93,062కి చేరింది. ఇందులో 3,04,68,079 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 4,05,513 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. ఇక ఇండియాలో ఇప్పటి వరకు కరోనాతో 4,19,470 మంది మృతి చెందారు. గడిచిన 24 గంటల్లో దేశంలో కరోనా నుంచి 38,740 మంది…
కరోనా మహమ్మారి నుంచి భూప్రపంచం ఎప్పటికి బయటపడుతుందో ఎవరికీ అర్ధం కావడం లేదు. మరో మూడు నాలుగేళ్లపాటు కరోనా నుంచి ఇబ్బందులు తప్పేలా కనిపించడంలేదు. కేసులు పెరిగినపుడు లాక్‌డౌన్ చేసుకుంటూ కంట్రోల్ అయినపుడు తెరుస్తూ జీవనం సాగిస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే భారత్ పొరుగునున్న బంగ్లాదేశ్‌లో కేసులు భారీగా నమోదవుతున్నాయి. దీంతో ఆక్కడ ఆంక్షలను కఠినంగా అమలు చేసేందుకు సిద్ధమైంది ఆ దేశం. జులై 23 నుంచి రెండు వారాల పాటు అంటే ఆగస్టు 5 వరకు…
కరోనా బారిన పడి ఇళ్లల్లో చికిత్స పొందుతున్న వారికి అజిత్రో మైసిన్ మెడిసిన్‌ను రిఫర్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, అజిత్రో మైసిన్ కంటే ప్లాసిబో మెడిసిన్ మేలైనదని తాజా పరిశోధనలో తేలింది. అజిత్రో మైసిన్ ను వినియోగించడం వలన ఆసుపత్రుల్లో చేరాల్సిన అవసరం రావొచ్చని పరిశోధకులు చెబుతున్నారు. కాలిఫోర్నియా, స్టాన్‌ఫోర్డ్ కు చెందిన పరిశోధకులు చేసిన ఈ పరిశోధనలలో ఈ విషయాలు వెలుగుచూశాయి. కోవిడ్ బారిన పడి ఇళ్లల్లో చికిత్స పొందుతున్న 263 మందిలో 171…
భారత్‌లో వ్యాక్సినేషన్‌ను వేగంగా అమలు చేస్తున్నారు. ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మరింత వేగం చేసేందుకు ముమ్మర ప్రయత్నాలు సాగుతున్నాయి. విదేశాలకు చెందిన స్పుత్నిక్ వీ వ్యాక్సిన్‌ను ఇప్పటికే దేశంలో వినియోగిస్తున్నారు. ఫైజర్ వ్యాక్సిన్ కూడా త్వరలోనే భారత్‌లో అందుబాటులోకి రాబోతున్నది. అదే విధంగా అమెరికాకు చెందిన మోడెర్నా వ్యాక్సిన్‌ను కూడా త్వరలోనే అందుబాటులోకి రాబోతున్నది. కోవాక్స్ కార్యక్రమం ద్వారా ఈ వ్యాక్సిన్లు దిగుమతి కాబోతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ అందరికీ వ్యాక్సిన్ అందుబాటులో ఉండాలనిచెప్పి కోవాక్స్ అనే…