కరోనా కేసులు తగ్గుతున్నా ముప్పు మాత్రం పూర్తిగా తగ్గిపోలేదు. ముప్పు ప్రమాదం ఇంకా పొంచి ఉన్నది. దీంతో వ్యాక్సిన్ పట్ల ప్రజల్లో అవగాహన కల్పించేందుకు చెన్నైకు చెందిన గౌతమ్ అనే వ్యక్తి చెన్నై మునిపల్ కార్పోరేషన్‌తో కలిసి వినూత్నంగా ప్రచారం చేయడం ప్రారంభించారు. ప్రజల్లో వ్యాక్సిన్ పట్ల, భయాన్ని అపోహలు తొలగించి అందరూ వ్యాక్సిన్ తీసుకోవాలని ఆటోలో ప్రయాణం చేస్తూ అవగాహన కల్పిస్తున్నాడు. అయితే, మాములుగా ఆటోలో ప్రయాణం చేస్తూ ప్రచారం చేస్తే ఎవరు పట్టించుకుంటారు. అందుకే ఆటోను వ్యాక్సిన్ సిరంజీ, వ్యాక్సిన్ సీసాగా మార్చి ప్రచారం చేయడం మొదలుపెట్టాడు. ఈ ఆటో మిగతా వాటికంటే విచిత్రంగా ఉండటంతో ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు.
Read: కరోనా నుంచీ కోలుకుని… కసరత్తులు చేస్తోన్న… బాలీవుడ్ ‘హెవీ వెయిట్’ హీరో!