మనిషి దగ్గినపుడు, తుమ్మినపుడు నోటి నుంచి తుంపర్లు గాల్లోకి వెలువడతాయి. కరోనా సోకిన వ్యక్తి శరీరంలో కరోనా ఉంటే అది ముక్కు, నోటిద్వారా బయటకు వస్తుంటాయి. అక్కడి నుంచి మరోకరికి సోకుతుంటాయి. అయితే, పంజాబ్‌లోని అమృత్‌సర్ ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో కరోనా రోగులకు చికిత్స అందించే క్రమంలో వైద్యులు సరికొత్త విషయాలను గుర్తించారు. కరోనా సోకిన వ్యక్తి కంటి నుంచి వచ్చే కన్నీటిలో కూడా కరోనా వైరస్ ఉన్నట్టు గుర్తించారు. దాదాపు 120 మంది రోగులపై…
ఇండియాలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. ఈరోజు భారీ స్థాయిలో కేసులు తగ్గాయి. ఇండియలో తాజాగా 30,549 కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్యశాఖ బులిటెన్‌లో పేర్కొన్నది. దీంతో దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 3,17,26,507కి చేరింది. ఇందులో 3,08,96,354 మంది ఇప్పటికే కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇక గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనాతో 422 మంది మృతి చెందారు. దీంతో ఇండియాలో ఇప్పటి వరకు కరోనాతో 4,25,195 మంది మృతి…
కరోనా మహమ్మారి కేసులు రోజురోజుకు పెరిగిపోతూనే ఉన్నాయి. కరోనా కేసులు తగ్గుతున్నా తీవ్రత ఏ మాత్రం తగ్గలేదు. ప్రతి ఒక్కరూ తప్పని సరిగా నిబంధనలు పాటించాలని ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా పేర్కొన్నారు. దేశంలో సూపర్ స్ప్రైడర్‌లుగా మారే కార్యక్రమాలను నియంత్రించాలని ఆయన పేర్కొన్నారు. ఇలాంటి కార్య క్రమాలను నిర్వహిస్తే వాటి ప్రభావం మూడు వారాల తరువాత కనిపిస్తుందని, అత్యవసరమైతే తప్పించి ప్రయాణాలు చేయవద్దని, మహమ్మారిని ఎదుర్కొవాలంటే తప్పని సరిగా నిబంధనలు పాటించి తీరాలని ఆయన…
తగ్గినట్టే తగ్గిన కోవిడ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి.. ఇప్పటికే టోక్యో వేదికగా జరుగుతోన్న ఒలింపిక్స్‌కు సైతం కరోనా సెగ తగిలింది.. పలువురు క్రీడాకారులు కరోనబారినపడ్డారు.. అయితే, కరోనా కల్లోలం సృష్టించడంతో జపాన్ ప్రభుత్వం ఎమర్జెన్సీ ప్రకటించింది.. క్యాపిటల్ సిటీ టోక్యో సహా ఆరు ప్రాంతాల్లో ఎమర్జెన్సీ ప్రకటించింది జపాన్.. టోక్యో, సైతమ, చిబ, కనగవ, ఒసాకా, ఒకినవ ప్రాంతాల్లో ఎమర్జెన్సీ పరిస్ధితిని ప్రకటించినట్టు ప్రధాని సుగ కార్యాలయం వెల్లడించింది.. అత్యవసరం అయితే తప్ప ప్రజలు బయటకు రావొద్దని..…
కరోనా మహమ్మారికి చెక్ పెట్టేందుకు ప్రస్తుతం వ్యాక్సిన్ ఒక్కటే పరిష్కారంగా కనిపిస్తున్నది. అయితే, వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినప్పటికీ, వేగంగా వ్యాక్సిన్‌ను అమలు చేస్తున్నప్పటికీ పెద్దగా ఉపయోగం ఉండటం లేదు. వ్యాక్సిన్ తీసుకున్న వాళ్లకు కూడా కరోనా సోకుతుండటంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో టీకాలను మిక్స్ చేస్తే ఎలాంటి ప్రభావం కనిపిస్తుంది అనే విషయంపై టీకా కంపెనీలు, శాస్త్రవేత్తలు దృష్టిసారించాయి. ఇందులో భాగంగా ఆస్త్రాజెనకా టీకాతో రష్యా స్పుత్నిక్ వి లైట్ టీకాను కలిపి ఇస్తే ఎలా…
కేరళలో కరోనా కేసులు భారీ సంఖ్యలో నమోదవుతున్నాయి. కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. దేశంలో పాజిటివ్ కేసులు తగ్గుతున్నా, కేరళలో మాత్రం అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. ఆరోజు కూడా కేరళలో అత్యధికంగా 22,064 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 33,49,365కి చేరింది. ఇక గడిచిన 24 గంటల్లో కేరళలో కరోనాతో 128 మంది మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం మరణాల సంఖ్య 16,585కి చేరింది. రాష్ట్రంలో…
కరోనా వైరస్‌తో పాటు మరో కొత్త వైరస్ పుట్టుకొచ్చింది. నోరో పేరుతో పిలుస్తున్న ఈ వైరస్ ఐదు వారాలుగా బ్రిటన్‌లో అత్యంత వేగంగా వ్యాపిస్తోంది. బ్రిటన్‌లో ఇప్పటి వరకూ ఈ వైరస్‌కు సంబంధించి 154 కేసులు గుర్తించారు. నోరో వైరస్ కేసులు పెరుగుతుండటంతో బ్రిటన్ ఆరోగ్యశాఖ ఆందోళన వ్యక్తం చేస్తోంది. నోరో వైరస్ బారినపడిన వారికి తల తిరగడం, వాంతులు రావడం లాంటి లక్షణాలు ఉన్నాయని తెలుస్తోంది. ఈ వైరస్ ఒకరి నుంచి మరొకరికి త్వరగా వ్యాప్తి…