భారత్‌లో వ్యాక్సినేషన్‌ను వేగంగా అమలు చేస్తున్నారు. ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మరింత వేగం చేసేందుకు ముమ్మర ప్రయత్నాలు సాగుతున్నాయి. విదేశాలకు చెందిన స్పుత్నిక్ వీ వ్యాక్సిన్‌ను ఇప్పటికే దేశంలో వినియోగిస్తున్నారు. ఫైజర్ వ్యాక్సిన్ కూడా త్వరలోనే భారత్‌లో అందుబాటులోకి రాబోతున్నది. అదే విధంగా అమెరికాకు చెందిన మోడెర్నా వ్యాక్సిన్‌ను కూడా త్వరలోనే అందుబాటులోకి రాబోతున్నది. కోవాక్స్ కార్యక్రమం ద్వారా ఈ వ్యాక్సిన్లు దిగుమతి కాబోతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ అందరికీ వ్యాక్సిన్ అందుబాటులో ఉండాలనిచెప్పి కోవాక్స్ అనే సంస్థను ఏర్పాటు చేసింది.
Read: ‘ఆడవాళ్ళు మీకు జోహర్లు’ షూటింగ్ మొదలెట్టేశారు!
ఇందులోని సభ్యదేశాలకు వ్యాక్సిన్‌ను ప్రపంచ ఆరోగ్యసంస్థ అందిస్తున్నది. ఇందులో భాగంగా కోవాక్స్ నుంచి 7.5 మిలియన్ డోసులు భారత్‌కు రాబోతున్నాయి. అయితే, ఈ వ్యాక్సిన్ డోసులు ఎప్పుడు భారత్‌కు చేరుకుంటాయి అనే విషయంపై క్లారిటీ రావాల్పి ఉన్నది. విదేశీ టీకా సంస్థలకు సంబందించి ఇండెమ్నిటీ క్లాజ్‌పై స్పష్టత వస్తేనేగాని టీకాలు భారత్‌లో ఎప్పుడు అందుబాటులోకి వస్తాయి అనే విషయంపై క్లారిటీ వస్తుంది. అయితే, మోడెర్నా టీకాను భారత్‌లో అత్యవసర వినియోగానికి అనుమతించారు. మోడెర్నా డోసుల దిగుమతులపై కేంద్రం ఎప్పటికప్పుడు ఆ సంస్థతో సంప్రదింపులు జరుపుతున్నట్టు నీతీ ఆయోగ్ సభ్యులు డాక్టర్ వీకే పాల్ తెలిపిన సంగతి తెలిసిందే.