కోవిడ్-19 కారణంగా కోలీవుడ్ స్టార్ హీరో కమల్ హాసన్ ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. నిన్న ఇటీవల ఆయన యూఎస్ ట్రిప్ ముగించుకుని వచ్చారు. ఆ సమయంలోనే దగ్గు రాగా, కమల్ కోవిడ్ టెస్ట్ చేయించుకున్నారు. పాజిటివ్ రావడంతో సెల్ఫ్ ఐసొలేషన్లోకి వెళ్లి, వైద్యుల సూచనతో పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కమల్ అభిమానులకు స్వయంగా తనకు కరోనా సోకిన విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. నిన్న సాయంత్రం ఆయన కూతురు, స్టార్ హీరోయిన్ శృతి హాసన్ కమల్…
టాలీవుడ్ సీనియర్ కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ కరోనా బారిన పడ్డారు. ఆయనతో పాటు ఆయన కుటుంబం మొత్తం కరోనా బారిన పడినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం శివశంకర్ మాస్టర్ గచ్చిబౌలిలోని ఎఐజి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. శివ శంకర్ మాస్టర్ ఆసుపత్రి బిల్లులు చాలా ఖర్చుతో కూడుకున్నాయని, ప్రస్తుతం శివ శంకర్ మాస్టర్ కుటుంబానికి అంత ఆర్థిక స్తోమత లేనందున దాతలు ఎవరైనా ముందుకు వచ్చి సహాయం చేయవలసిందిగా ఆయన…
యూనివర్సల్ స్టార్ హీరో కమల్ హాసన్ కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. యూరప్ లో విక్రమ్ షూటింగ్ కోసం వెళ్లిన ఆయనకు కరోనా సోకడంతో షూటింగ్ నిలిపివేశారు. ప్రస్తుతం కమల్ హోమ్ క్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. ఇకపోతే కమల్ కొన్నిరోజులు రాకపోతే ఆయన నిర్వహిస్తున్న బిగ్ బాస్ పరిస్థితి ఏంటీ ..? అనేది ప్రస్తుతం తమిళీయులను తొలుస్తున్న ప్రశ్న.. అయితే దీనికి ఆన్సర్ దొరికేసిందని తెలుస్తోంది. కమల్ వచ్చేంత వరకు ఆయన స్థానాన్ని ఆమె…
ఇండియాలో కరోనా కేసులు రోజు రోజుకు తగ్గుతూ వస్తున్నాయి. తాజాగా కేంద్ర ఆరోగ్యశాఖ కరోనా బులిటెన్‌ను రిలీజ్ చేసింది. ఈ బులిటెన్ ప్రకారం గడిచిన 24 గంటల్లో ఇండియాలో కొత్తగా 7,579 కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,45,26,480 కి చేరింది. ఇక ఇందులో 3,39,46,749 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 1,13,584 కేసులు యాక్టీవ్ గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో కరోనాతో 236…
ఏపీ గవర్నర్ కరోనా నుంచి కోలుకున్నారు. రేపు మధ్యాహ్నం ఆయన హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడకు చేరుకొని అక్కడి నుంచి రాజ్‌భవన్‌కు చేరుకుంటారని గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా తెలిపారు. ఢిల్లీ పర్యటన తరువాత కరోనా లక్షణాలు బయటపడటంతో హైదరాబాద్ ఏఐజీ లో చికిత్స తీసుకున్నారు. ఆరోగ్యం మెరుగుపడతంతో ఆయన రేపు మధ్యాహ్నం రాజ్ భవన్‌కు చేరుకోనున్నారు. హైదరాబాద్‌లో చికిత్సపొందుతున్న సమయంలో ఆయన్ను తెలంగాణ గవర్నర్ పరామర్శించిన సంగతి తెలిసిందే. ఇక ఏపీ…
ప్రముఖ నటుడు కమల్ హాసన్ కొవిడ్ 19 బారిన పడ్డారు. ఆ విషయాన్ని ఆయనే స్వయంగా తెలిపారు. అంతేకాదు ‘కరోనా మహమ్మారి ఇంకా మన మధ్యే ఉందని, దానితో జాగ్రత్తగా ఉండాల’ని కమల్ హాసన్ సూచించారు. సోమవారం మధ్యాహ్యం కమల్ హాసన్ తాను హస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్న విషయాన్ని స్వయంగా ట్వీట్ చేశారు. ‘యూ.ఎస్. ట్రిప్ నుండి తిరిగి వచ్చాక కాస్తంత దగ్గు వచ్చిందని, పరీక్షలు నిర్వహించగా ఇన్ ఫెక్షన్ ఉందని వైద్యులు నిర్థారించారని అన్నారు.…
తెలంగాణలో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 22,902 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 103 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనాతో తాజాగా ఒకరు మరణించారు. తాజా కేసులతో ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 6,74,555 పాజిటివ్ కేసులు నమోదు కాగా మొత్తం మృతుల సంఖ్య 3,981కి పెరిగింది. కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 49 కేసులు వెలుగు చూశాయి. గడిచిన 24 గంటల్లో 153 మంది…
కరోనా మహమ్మారి కొద్దిగా నిదానించడంతో అందరు ఇప్పుడిప్పుడే ఊపిరి పీల్చుకుంటున్నారు. ఈ సమయంలో పలువురు సెలబ్రిటీలు కరోనా బారిన పడడం అభిమానులను ఆందోళనకు గురిచేస్తుంది. ఇటీవల హీరోయిన్ ప్రగ్య జైస్వాల్ కరోనా బారిన పది కోలుకున్న విషయం తెలిసిందే. ఇక తాజాగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం సురేందర్ రెడ్డి ఏజెంట్ సినిమా షూటింగ్ కోసం యూరప్ వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడ కరోనా ప్రభావం ఎక్కువ ఉండడంతో ఆయన కరోనా బారిన…
ఆంధ్రప్రదేశ్ లో రోజు కరోనా కేసులు పెరుగుతూ… తగ్గుతూ వస్తున్నాయి. ఇక తాజా బులిటెన్ ప్రకారం గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 31, 040 శాంపిల్స్ పరీక్షించగా.. 168 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. మరో ఇద్దరు కరోనా బాధితులు మృతిచెందారు. ఇక, ఇదే సమయంలో 301 మంది కోవిడ్ నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నారు. దీంతో.. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య 3,01,28,928 కు చేరుకోగా… మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య…
ఇండియాలో కరోనా కేసులు మళ్ళీ భారీగా పెరిగాయి. 24 గంటల్లో ఇండియాలో కొత్తగా 10,197 కేసులు నమోదయ్యాయి. ఇక దేశంలో 3,38,73,890 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 1,28,555 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో కరోనాతో 301 మంది మృతి చెందారు. దీంతో ఇండియాలో ఇప్పటి వరకు కరోనాతో 4,64,153 మంది మృతి చెందినట్టు గణాంకాలు చెబుతున్నాయి. 24 గంటల్లో ఇండియాలో 12,134 మంది కరోనా నుంచి కోలుకోగా 50,71,135 మంది టీకాలు తీసుకున్నారు.…