దేశంలో కరోనా మహమ్మారి ఉదృతి కొనసాగుతోంది. కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. ప్రతిరోజూ రెండున్నర లక్షల కేసులు నమోదవుతున్నాయి. తాజాగా దేశంలో 2,59,170 కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,53,21,089కి చేరింది. ఇందులో 1,31,08,582 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 20,31,977 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో ఇండియాలో 1,54,761 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యినట్టు బులెటిన్ లో పేర్కొన్నారు. …
మే 1 వ తేదీ నుంచి దేశంలో మూడో విడత వ్యాక్సినేషన్ కార్యక్రమం మొదలు కాబోతున్నది. మూడో విడత వ్యాక్సినేషన్ కు సంబంధించిన ప్రకటనను నిన్నటి రోజున కేంద్రం రిలీజ్ చేసింది. 18 ఏళ్ళు పైబడిన వ్యక్తులు అందరికి వ్యాక్సిన్ వేసుకునే వెసులుబాటును కల్పించింది. ప్రస్తుతం 45 ఏళ్ళు పైబడిన వారికీ వ్యాక్సిన్ అందిస్తున్నారు. రెండో విడత వ్యాక్సినేషన్ లో ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రిలో వ్యాక్సిన్ అందిస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఫ్రీగా, ప్రైవేట్ ఆసుపత్రుల్లో నామమాత్రపు ధరలతో…
కరోనా మహమ్మారి రోజు రోజుకు విజృంభిస్తోంది. కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్న తరుణంలో స్కూళ్లకు సెలవులు ప్రకటిస్తున్నారు. విద్యాలయాలు కరోనా వ్యాప్తికి కారణమౌతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రపంచదేశాల్లో కరోనా భయం ఇంకా వెంటాడుతూనే ఉన్నది. కొన్ని దేశాల్లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టినా మళ్ళీ రాదనే గ్యారెంటీ లేకపోవడంతో అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇదిలా ఉంటె, స్పెయిన్ దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ ఏ స్థాయిలో ఉన్నదో చూశాం. గతంలో ఆ దేశంలో పెద్ద…
కరోనా మహమ్మారి కారణంగా అనేక రాష్ట్రాల్లో లాక్ డౌన్ విధిస్తున్నారు. ఢిల్లీలో వారం రోజులపాటు లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఢిల్లీలో ఎప్పుడు లేని విధంగా సెకండ్ వేవ్ ఉదృతి కొనసాగుతోంది. దీంతో కరోనా మహమ్మారి నుంచి బయటపడేందుకు ఆ రాష్ట్రంలో లాక్ డౌన్ ను విధించారు. ఇక ఇదిలా ఉంటె, మధ్యప్రదేశ్ లో పరిస్థితులు వేరుగా ఉన్నాయి. మధ్యప్రదేశ్ లో పాజిటివ్ కేసులతో పాటుగా మరణాల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతున్నది. పైగా ఆ రాష్ట్రంలో…
ప్రజలు సామాజికంగా, ఆర్ధికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మహమ్మారి నుంచి బయటపడేందుకు ప్రభుత్వాలు కఠిన చర్యలకు ఉపక్రమిస్తున్నాయి. ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో లాక్ డౌన్, కర్ఫ్యూ విధించారు. మరికొన్ని రాష్ట్రాలు ఆ దిశగానే అడుగులు వేస్తున్నాయి. ఇక ఇండియాలో రోజువారీ కేసులు రెండు లక్షలకు పైగా నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. దేశంలో మొదటి 25 లక్షల కేసులు నమోదవ్వడానికి 198 రోజుల సమయం పడితే, చివరి 25 లక్షల కేసులు కేవలం 15 రోజుల వ్యవధిలోనే నమోదయ్యాయి. దేశంలో ఇప్పటి…
దేశంలో కరోనా కేసులు రోజు రోజుకు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. కరోనా నుంచి బయటపడేందుకు ఆంక్షలను కఠినంగా అమలు చేస్తున్నారు. నిబంధనలు కట్టుదిట్టం చేశారు. అయినప్పటికీ కరోనా బారిన పడుతున్నారు. కరోనా కేసులు అధికంగా నమోదవుతున్న రాష్ట్రాల్లో గుజరాత్ కూడా ఒకటి. చిన్నపాటి జ్వరం, జలుబు వంటివి కలిగినా ఆసుపత్రులకు పరిగెడుతున్నారు. ఇక కరోనా సోకిన వ్యక్తుల్లో ఉత్సాహం నింపేందుకు హెల్త్ వర్కర్లు వినూత్న ప్రయోగం చేశారు. కరోనా రోగుల ముందు డ్యాన్స్ చేసి వారిలో ఉత్సాహం నింపారు. ఈ…
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. రోజు 35 వేలకు పైగా టెస్టులు చేస్తుండగా ఆరు నుంచి ఏడు వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. పాజిటివ్ కేసుల శాతం క్రమంగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. 35 వేల టెస్టులు చేస్తేనే ఏడువేలకు పైగా కేసులు వస్తే ఇక లక్ష వరకు రోజువారీ టెస్టులు నిర్వహిస్తే ఎన్ని కేసులు వస్తాయో చెప్పక్కర్లేదు. ముఖ్యంగా చిత్తూరు, గుంటూరు, తూర్పు గోదావరి జిల్లాల్లో అత్యధికంగా కేసులు నమోదవుతున్నాయి. ఈ ప్రాంతాల్లో కేసులు పెరగడంపై ప్రభుత్వం…
ప్రపంచాన్ని కరోనా ఎంతగా భయపెడుతుంది అంటే… తప్పులు చేసి జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలను కూడా అక్కడి నుంచి పంపించే విధంగా భయపెడుతోంది. ఆసియా, యూరప్, దక్షిణ అమెరికా ఖండాలతో పాటుగా అటు ఆఫ్రికా ఖండంలో కూడా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఆఫ్రికా ఖండంలో కేసులు పెరగడం అంటే అక్కడ మరణమృదంగం అని చెప్పాలి. ఆఫ్రికా ఖండంలోని దేశాల్లో వైద్య వసతులు తగినంతగా ఉండవు. పైగా, ఆఫ్రికా ఖండంలోని దేశాల్లో చాలా వరకు ఒక్క వ్యాక్సిన్ కూడా అందుబాటులో లేకపోవడంతో ప్రజలు నానా ఇబ్బందులు…
ఇండియాలో కరోనా కేసులు రోజు రోజుకు భారీ స్థాయిలో పెరిగిపోతున్నాయి. తాజాగా కేంద్రం కరోనా బులెటిన్ ను రిలీజ్ చేసింది. ఈ బులెటిన్ ప్రకారం దేశంలో కొత్తగా 2,34,692 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,45,26,609కి చేరింది. ఇందులో 1,26,71,220 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 16,79,740 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనాతో 1341 మంది మృతి చెందారు. …
దేశంలో కరోనా కేసులు ఇబ్బడిముబ్బడిగా పెరుగుతున్నాయి. మొదటి వేవ్ లో పెద్ద వయసుకలిగిన వ్యక్తులకు కరోనా సోకగా, సెకండ్ వేవ్ లో ఎక్కువమంది యువత కరోనా బారిన పడుతున్నారు. పార్టీలు, ఫంక్షన్లు, వేడుకలు, పబ్లిక్ ప్లేస్ లు కరోనా హాట్ స్పాట్ లుగా మారుతున్నాయి. ఎక్కువ మంది ఒక చోట గుమికూడి ఉండొద్దని హెచ్చరిస్తున్నారు. గ్రామాల్లో కంటే కరోనా నగరాల్లో అధికంగా విస్తరిస్తోంది. 2టైర్, 3 టైర్ నగరాల్లో కరోనా కేసులు భారీ సంఖ్యలో నమోదవుతుండటం ఆందోళన…