ప్రజలు సామాజికంగా, ఆర్ధికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మహమ్మారి నుంచి బయటపడేందుకు ప్రభుత్వాలు కఠిన చర్యలకు ఉపక్రమిస్తున్నాయి. ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో లాక్ డౌన్, కర్ఫ్యూ విధించారు. మరికొన్ని రాష్ట్రాలు ఆ దిశగానే అడుగులు వేస్తున్నాయి.
ఇక ఇండియాలో రోజువారీ కేసులు రెండు లక్షలకు పైగా నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. దేశంలో మొదటి 25 లక్షల కేసులు నమోదవ్వడానికి 198 రోజుల సమయం పడితే, చివరి 25 లక్షల కేసులు కేవలం 15 రోజుల వ్యవధిలోనే నమోదయ్యాయి. దేశంలో ఇప్పటి వరకు మొత్తం కేసులు 1.53 కోట్లకు పైగా నమోదవ్వడం విశేషం. కరోనా వైరస్ ట్రాకర్ వరల్డ్ మీటర్స్ ఇన్ఫో ప్రకారం దేశంలో 24 గంటల్లో 1757 మరణాలు నమోదైనట్టు తెలుస్తోంది. పాజిటివ్ కేసులతో పాటుగా మరణాల రేటు కూడా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.