దేశంలో కరోనా కేసులు రోజు రోజుకు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. కరోనా నుంచి బయటపడేందుకు ఆంక్షలను కఠినంగా అమలు చేస్తున్నారు. నిబంధనలు కట్టుదిట్టం చేశారు. అయినప్పటికీ కరోనా బారిన పడుతున్నారు. కరోనా కేసులు అధికంగా నమోదవుతున్న రాష్ట్రాల్లో గుజరాత్ కూడా ఒకటి. చిన్నపాటి జ్వరం, జలుబు వంటివి కలిగినా ఆసుపత్రులకు పరిగెడుతున్నారు. ఇక కరోనా సోకిన వ్యక్తుల్లో ఉత్సాహం నింపేందుకు హెల్త్ వర్కర్లు వినూత్న ప్రయోగం చేశారు. కరోనా రోగుల ముందు డ్యాన్స్ చేసి వారిలో ఉత్సాహం నింపారు. ఈ సంఘటన గుజరాత్ లోని పారులా సేవాశ్రమ్ లో జరిగింది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.