ఢిల్లీలో పలు సమావేశాలకు హాజరుకావాల్సిన కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైకి శనివారం కొవిడ్ పాజిటివ్‌గా తేలడంతో కార్యక్రమాలను రద్దు చేసుకున్నారు. ఈ మేరకు సీఎం బసవరాజు బొమ్మై అధికారికంగా తన ట్విట్టర్ ఖాతా వేదికగా ప్రకటించారు.
దేశ రాజధానిలో పెరుగుతున్న కోవిడ్ కేసుల నేపథ్యంలో ఢిల్లీలోని లోక్ నాయక్ జై ప్రకాష్ నారాయణ్ (ఎల్‌ఎన్‌జేపీ) ఆస్పత్రి కొవిడ్ వేరియంట్ మ్యుటేషన్‌పై అధ్యయనం నిర్వహించింది. దీనికి సంబంధించిన నివేదిక ఇంకా విడుదల కాలేదు.
దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు భారీగా తగ్గాయి. గడిచిన 24గంటల్లో16,464 పాజిటివ్ కేసులు మాత్రమే వెలుగుచూశాయి. ఇటీవల క్రమంగా పెరుగుతున్న కేసులు భారీగా తగ్గడంతో కొంత ఉపశమనం లభించినట్లు భావించవచ్చు. మరోవైపు తాజాగా 39 మంది కరోనా బారినపడి చనిపోయారు.
శవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. శుక్రవారంతో పోలిస్తే కాస్త తగ్గాయి. శుక్రవారం ఉదయం వరకు 21,880 కేసులు నమోదు కాగా.. గడిచిన 24గంటల్లో 21,411 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. ఇటీవల కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. మరోవైపు తాజాగా 67 మంది కరోనా బారినపడి చనిపోయారు.
దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. బుధవారం ఉదయం వరకు 20,557 కేసులు నమోదు కాగా.. గడిచిన 24గంటల్లో 21,566 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి.
దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు భారీగా పెరిగాయి. గడిచిన 24గంటల్లో 20,557 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. మంగళవారం ఉదయం వరకు 15,528 కేసులు మాత్రమే నమోదు కాగా ఇవాళ భారీగా పెరిగాయి.
మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ ప్రధాని నరేంద్ర మోదీకి అభినందనలు తెలిపారు. భారతదేశంలో 200 కోట్ల వ్యాక్సినేషన్‌లను అందించడంలో మరో మైలురాయిని సాధించినందుకు గానూ అభినందించారు. కొవిడ్ ప్రభావాన్ని తగ్గించినందుకు భారతీయ వ్యాక్సిన్ తయారీదారులు, ప్రభుత్వంతో కొనసాగుతున్న భాగస్వామ్యానికి బిల్‌గేట్స్ ట్విట్టర్‌లో కృతజ్ఞతలు తెలిపారు.
దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు స్వల్పంగా తగ్గాయి. ఆదివారం 20,528 కేసులు నమోదు కాగా.. గడిచిన 24గంటల్లో 16,935 పాజిటివ్ కేసులు మాత్రమే వెలుగుచూశాయి. ఇటీవల క్రమంగా పెరుగుతున్న కేసులు గత 24 గంటల్లో 3వేల వరకు తగ్గడంతో కొంత ఉపశమనం లభించినట్లు భావించవచ్చు.
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఓ పన్నీర్‌సెల్వం కొవిడ్-19 లక్షణాలు కనిపించడంతో ఆసుపత్రిలో చేరినట్లు ఆయనకు చికిత్స అందిస్తున్న ఎంజీఎం ఆస్పత్రి శనివారం తెలిపింది.