కరోనా మహమ్మారి ఒమిక్రాన్‌గా రూపాంతరం చెంది మరోసారి ప్రపంచ దేశాలను భయాందోళనకు గురిచేస్తుంది. ఈ వేరియంట్ ఇప్పటికే భారత్‌లో ప్రవేశించేసరికి విమాన ప్రయాణాలపై ఆంక్షాలు విధించారు. అంతేకాకుండా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వెలుగులోకి వచ్చిన తరువాత ఒమిక్రాన్ సోకిన దేశాల నుంచి గత నెలలో వచ్చిన వారిని ట్రేసింగ్ చేసి టెస్టింగ్ నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం ఉమిలాడా గ్రామంలో అర్జాల గోపాల కృష్ణ (51) అనే వ్యక్తి గత నెల 23న…
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు ఇంకా పూర్తిగా తగ్గలేదు. రోజుకు 200కి పైగానే కేసులు వెలుగు చూస్తున్నాయి. తాజాగా ఖమ్మం జిల్లా వైరాలోని గురుకుల పాఠశాలలో కరోనా కలకలం రేపింది. వైరా గురుకుల పాఠశాలలో పలువురు విద్యార్థులకు ఇటీవల కరోనా పరీక్షలు నిర్వహించగా 13 మందికి కరోనా ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. మొత్తం 650 మంది విద్యార్థులకు కరోనా పరీక్షలు నిర్వహించామని… వీరిలో 13 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు అధికారులు వెల్లడించారు. Read…
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి ఇంకా పూర్తిస్థాయిలో అదుపులోకి రాలేదు.. ఎప్పుడు నుంచి ఎలా కరోనా సోకుతుందో తెలియని పరిస్థితి ఉంది.. తాజాగా నెల్లూరు జిల్లాలోని కావలి రూరల్ పోలీస్ స్టేషన్ కరోనా కలకలం సృష్టించింది.. ఒకే పోలీస్ స్టేషన్‌లో ఏకంగా 9 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది.. కొందరిలో కరోనా లక్షణాలు కనిపించడంతో.. అనుమానంతో అందరికీ కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.. అయితే, సీఐ, ఎస్సై, హెడ్ కానిస్టేబుల్ సహా మొత్తం 9 మంది పోలీసు సిబ్బంది…
తిరుపతి : చైనాలో పుట్టిన కరోనా వైరస్ ఎవరినీ వదలడం లేదు. పేద, ధనిక అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికీ కరోనా మహమ్మారి సోకుతోంది. ఇప్పటికే చాలా మంది రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు ఇతరులు ఇలా చాలా మంది కరోనా బారీన పడ్డారు. అయితే.. తాజాగా ఏపీ డిప్యూటీ సిఎం నారాయణ స్వామికి కూడా కరోనా పాజిటివ్ గా నిర్థారణ అయింది. రెండు రోజులుగా అస్వస్థతకు గురైన ఆయన… ఇవాళ కరోనా పరీక్షలు చేయించుకున్నారు.…
భారత జట్టులో కరోనా కలకలం రేపింది. టీం ఇండియా ఆల్ రౌండర్ కృనాల్ పాండ్యాకు కరోనా పాజిటివ్ గా తేలింది. అయితే కోహ్లీ నేతృత్వంలోని ఓ భారత జట్టు ప్రస్తుతం ఇంగ్లాండ్ లో పర్యటిస్తుండగా శిఖర్ ధావన్ కెప్టెన్సీలోని మరో జట్టు శ్రీలంకతో పరిమిత ఓవర్ల సిరీస్ లో తలపడుతుంది. అయితే ఇప్పటికే వన్డే సిరీస్ ను 2-1 తో ధావన్ సేన సొంతం చేసుకోగా ప్రస్తుతం టీ20 సిరీస్ లో 1-0 తో ఆధిక్యంలో ఉంది.…
ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ కోసం కోహ్లీ సారధ్యంలోని భారత జట్టు ఇంగ్లాండ్ వెళ్లిన విషయం తెలిసిందే. అయితే ఈ ఫైనల్స్ లో ఓడిన టీంఇండియా తర్వాత ఇంగ్లాండ్ తో ద్వైపాక్షిక సిరీస్ లలో పాల్గొననుంది. అందుకోసం అక్కడే ఉండిపోయింది. అయితే ఇప్పుడు భారత జట్టులో కరోనా కలకలం రేపినట్లు తెలుస్తుంది. జట్టులోని ఓ ఆటగాడు కరోనా బారిన పడినట్లు తెలుస్తుంది. అయితే ఇంగ్లాండ్ తో సిరీస్ కు ఎక్కువ సమయం ఉండటంతో బీసీసీఐ ఆటగాళ్లకు మూడువారాలు…
కరోనా మహమ్మారి కేసులు క్రమంగా తగ్గుతున్నా.. ఇంకా ఆందోళన కలిగిస్తూనే ఉన్నాయి.. తాజాగా.. నిజామాబాద్ జిల్లా నందిపేటలో కరోన కలకలం సృష్టించింది.. సూర్యాపేట నుండి వచ్చిన వలస కూలీలకు 16 మందికి కరోనా పాజిటివ్ గా తేలింది… దీంతో. వారితో కలిసి పనిచేసినవారిలో టెన్షన్ మొదలైంది.. దీంతో.. వారితో కలిసి పనిచేసిన 200 మంది వలస కూలీలకు రేపు కరోనా నిర్ధారణ పరీక్షలు చేసేందుకు సిద్ధం అవుతున్నారు వైద్యశాఖ అధికారులు.. మరోవైపు కరోనా పాజిటివ్ వచ్చిన వారిని…
టోక్యోకు చేరుకున్న సెర్బియా బృందంలోని ఓ అథ్లెట్ కరోనా బారిన పడ్డాడు. టోక్యోలోని హనెడా విమానాశ్రయంకు చేరుకున్న సెర్బియా టీం ఆటగాళ్లకు కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించారు. వీరిలో ఒకరికి కరోనా సోకింది. ఈ బృందం నాంటో నగరంలో ఒలింపిక్స్ కోసం శిక్షణ పొందాల్సి ఉండగా, పాజిటివ్‌గా తేలిన అథ్లెట్‌ను ఐసోలేషన్‌కు పంపారు. మిగతా వారిని ఎయిర్‌పోర్టు సమీపంలోని ప్రత్యేక కేంద్రానికి తరలించారు. గత నెలలో జపాన్ చేరుకున్న ఉగాండా జట్టులోని ఇద్దరు ఆటగాళ్ళు కూడా కరోనా…
నిజామాబాద్ జిల్లాలో కరోనా కోరలు చాస్తోంది. ప్రతి రోజూ రికార్డు స్థాయిలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. పేద, ధనిక ఆన్ తేడాలు లేకుండా అందరికీ ఈ వైరస్ సోకుతోంది. అటు జిల్లాలోని ఆర్టీసీ ఉద్యోగులు కరోనా బారిన పడుతున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని ఆరు డిపో పరిధిలో ఏకంగా 165 మంది ఆర్టీసీ ఉద్యోగులకు వైరస్ సోకింది. దీంతో అప్రమత్తమైన అధికారులు వైరస్ వ్యాప్తి నియంత్రణపై దృష్టి కేంద్రీకరించారు. బస్సులను శానిటైజ్ చేయడంతో పాటు ప్రయాణికులు భౌతిక…
కరోనా సెకండ్ వేవ్ మరోసారి గతంలో నెలకొన్న పరిస్థితులను గుర్తు చేస్తోంది. కరోనా వైరస్ భయంతో గతంలో చాలామంది ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా మళ్లీ ఇప్పుడు అలాంటి పరిస్థితులు నెలకొంటున్నాయి. కరోనా సోకిందన్న భయంతో పురుగుల మందు తాగి యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పెదవేగి మండలం నడిపల్లి గ్రామానికి చెందిన షేక్ విలాయత్ అనే యువకుడికి కరోనా పాజిటివ్ వచ్చిందని తెలిసి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతను గుంటూరు స్పిన్నింగ్ మిల్…