నిజామాబాద్ జిల్లాలో కరోనా కోరలు చాస్తోంది. ప్రతి రోజూ రికార్డు స్థాయిలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. పేద, ధనిక ఆన్ తేడాలు లేకుండా అందరికీ ఈ వైరస్ సోకుతోంది. అటు జిల్లాలోని ఆర్టీసీ ఉద్యోగులు కరోనా బారిన పడుతున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని ఆరు డిపో పరిధిలో ఏకంగా 165 మంది ఆర్టీసీ ఉద్యోగులకు వైరస్ సోకింది. దీంతో అప్రమత్తమైన అధికారులు వైరస్ వ్యాప్తి నియంత్రణపై దృష్టి కేంద్రీకరించారు. బస్సులను శానిటైజ్ చేయడంతో పాటు ప్రయాణికులు భౌతిక దూరం పాటించేలా చర్యలు చేపట్టారు. మాస్క్ ఉంటేనే బస్సులోకి అనుమతి ఇస్తున్నారు.