తెలంగాణ పోలీస్ శాఖను కరోనా మహమ్మారి కలవరపెడుతోంది. తెలంగాణ వ్యాప్తంగా ప్రతి పోలీస్ స్టేషన్‌లో ఎవరో ఒకరికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అవుతోంది. కరోనా సమయంలో ఫ్రంట్ లైన్ వారియర్లుగా సేవలు అందించిన పోలీసులు కరోనా బారిన పడుతుండటం బాధాకరమని చెప్పాలి. కరోనా థర్డ్ వేవ్‌లో భాగంగా ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా సుమారు 500 మంది పోలీసులు కరోనా బారిన పడినట్లు అధికారులు చెప్తున్నారు. Read Also: విద్యార్థులకు అలర్ట్.. ఈనెల 30 వరకు అన్ని పరీక్షలు వాయిదా…
ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఈరోజు కొత్తగా 4,570 కేసులు వెలుగు చూశాయి. ఓ పక్క సామాన్యులు.. మరోవైపు రాజకీయ ప్రముఖులు వరుసగా కరోనా బారిన పడుతున్నారు. ప్రకాశం జిల్లాలో పలువురు రాజకీయ నేతలకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అవుతోంది. తాజాగా గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు కరోనా బారిన పడ్డారు. దీంతో తాను హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు ఎమ్మెల్యే అన్నా రాంబాబు ప్రకటించారు. ఇటీవల తనను కలిసిన వారందరూ టెస్టులు చేయించుకోవాలని సూచించారు.…
దేశ వ్యాప్తంగా కరోనా థర్డ్ వేవ్ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తోంది. ఈ నేపథ్యంలో పలువురు రాజకీయ ప్రముఖులు, సినీ సెలబ్రిటీలు కరోనా బారిన పడుతున్నారు. తాజాగా ఏపీ దేవాదాయ శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. తనకు స్వల్ప లక్షణాలు ఉండటంతో కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ వచ్చిందని మంత్రి అవంతి శ్రీనివాస్ స్వయంగా వెల్లడించారు. ఇటీవల తనను కలిసిన వారందరూ కరోనా టెస్టులు చేయించుకోవాలని సూచించారు. తనకు నివాసానికి…
దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతూనే వుంది. 2లక్షలకు చేరువలో కరోనా పాజిటివ్ కేసులు కొనసాగుతున్నాయి. గత కొద్దిరోజులుగా వీఐపీలకు కరోనా సోకుతున్న సంగతి తెలిసిందే. తాజాగా బీజేపీ కేంద్ర కార్యాలయంలో 50 మంది కరోనా బారిన పడడం ఆందోళన కలిగిస్తోంది. పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ, పార్లమెంటరీ బోర్డులు గురువారం సమావేశం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉద్యోగులకు కరోనా నిర్దారణ పరీక్షలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ కమిటీ సమావేశాలకు హాజరుకావాల్సి ఉంది. కరోనా పరీక్షల్లో 50…
దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌కు ముందు టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. టీమిండియా ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో అతడు ఈనెల 19 నుంచి ప్రారంభం కానున్న వన్డే సిరీస్‌కు అందుబాటులో ఉండటం అనుమానంగా మారింది. భారత జట్టు వన్డే సిరీస్‌లో పాల్గొనేందుకు ఈనెల 12న కేప్ టౌన్ విమానం ఎక్కాల్సి ఉంది. అయితే కరోనా వచ్చిన నేపథ్యంలో వాషింగ్టన్ సుందర్ ఇతర సభ్యులతో కలిసి దక్షిణాఫ్రికాకు వెళ్లకపోవచ్చని తెలుస్తోంది. ఈ విషయంపై స్పందించేందుకు…
దేశంలో కరోనా మహమ్మారి ఎవరినీ వదిలిపెట్టడం లేదు. ముఖ్యంగా వరుసబెట్టి వీఐపీలందరూ కరోనా బారిన పడుతున్నారు. పలువురు రాజకీయ ప్రముఖులకు కూడా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అవుతోంది. తాజాగా బీహార్ సీఎం నితీష్ కుమార్‌కు కరోనా పాజిటివ్ వచ్చింది. ఆయన వైద్యుల సలహా మేరకు ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉన్నారని బీహార్ సీఎంవో వెల్లడించింది. ప్రతి ఒక్కరూ జాగ్రత్త చర్యలు తీసుకోవాలంటూ సీఎం నితీష్ పిలుపునిచ్చారని తెలిపింది. గతవారం నితీష్ కుమార్ నివాసంలో 11 మందికి కరోనా…
దేశంలో కరోనా కేసుల సంఖ్య మరోసారి విపరీతంగా పెరుగుతోంది. కరోనా వల్ల సామాన్యులతో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు, సినిమా సెలబ్రిటీలు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు. తాజాగా కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా ద్వారా స్వయంగా వెల్లడించారు. ప్రస్తుతం తాను హోం క్వారంటైన్‌లో ఉన్నట్లు ఆయన ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఇటీవల తనను కలుసుకున్న వారు జాగ్రత్తగా ఉండాలని, కరోనా టెస్టులు చేయించుకోవాలని రాజ్‌నాథ్…
వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో కరోనా కేసులు భయపెడుతున్నాయి మూడు రోజుల్లోనే 29 మంది కేఎంసీలో కరోనా మహమ్మారి బారిన పడ్డారు. కరోనా బారిన పడ్డ వారిలో మెడికల్ కాలేజి ప్రిన్సిపాల్. ఇద్దరు ప్రొఫెసర్లు 26 మంది మెడీకోలు వున్నారు. దీంతో కాకతీయ మెడికల్ కాలేజ్, ఎంజీఎం ఆస్పత్రిలో మెడికోలు అప్రమత్తం అయ్యారు. వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో కరోనా కేసులు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. మొన్న 17 మంది మెడికల్ విద్యార్థులకు కరోనా పాజిటివ్ గా…
తెలంగాణలో కరోనా వైరస్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఇప్పటికే పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులు కరోనా బారిన పడ్డారు. తాజాగా టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. కోవిడ్ లక్షణాలు కనిపించడంతో శనివారం పరీక్షలు చేయించుకోగా.. పాజిటివ్ వచ్చినట్లు స్వయంగా ఆయనే వెల్లడించారు. ఇటీవల తనను కలసిన వారంతా కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని ఎమ్మెల్సీ సూచించారు. కరోనా థర్డ్ వేవ్ విజృంభిస్తున్న తరుణంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. Read Also:…
ప్రపంచమంతా కరోనా కల్లోలం కొనసాగుతోంది. చాలా దేశాల్లో కరోనా కేసులు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ మ్యాక్స్‌వెల్ కూడా కరోనా బారిన పడ్డాడు. దీంతో అధికారులు అతడిని ఐసోలేషన్‌కు తరలించారు. ప్రస్తుతం మ్యాక్స్‌వెల్ బిగ్‌బాష్ టోర్నీలో మెల్‌బోర్న్ స్టార్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఇప్పటికే మెల్‌బోర్న్ జట్టులో 12 మంది కరోనా బారిన పడగా ఇప్పుడు మ్యాక్స్‌వెల్ 13వ వాడు కావడం గమనార్హం. ఆ జట్టులో 8 మంది సహాయక సిబ్బంది, నలుగురు ఆటగాళ్లకు…