ప్రపంచ దేశాల కంటిమీద కునుకు లేకుండా చేసిన కరోనా మహమ్మారి విజృంభణ తగ్గింది.. ప్రపంచవ్యాప్తంగా పాజిటివ్ కేసులు సంఖ్య భారీగా తగ్గింది.. అయితే, ఇప్పటికే ఎంతో మంది దేశాధినేతలను పలకరించింది కరోనా.. దేశాల అధ్యక్షులు, ప్రధానులు, మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రముఖులు ఇలా ఎంతో మందిని పలకరించింది మహమ్మారి.. తాజాగా, ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్ మహమ్మారి బారినపడ్డారు. కొన్ని అనుమానితల లక్షణాలు ఉండడంతో.. ఆయనకు కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా తేలింది.. దీంతో, వైద్య…
వెస్టిండీస్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌కు ముందు భారత క్రికెట్ జట్టులో కరోనా మహమ్మారి కలకలం రేపుతోంది. పలువురు టీమిండియా క్రికెటర్లు కరోనా బారిన పడినట్లు తెలుస్తోంది. మొత్తం 8 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిందని.. బాధితుల్లో శిఖర్ ధావన్, రుతురాజ్ గైక్వాడ్, శ్రేయస్ అయ్యర్ ఉన్నారని తెలుస్తోంది. క్రికెటర్లతో పాటు టీమిండియా సపోర్ట్ స్టాఫ్‌కు కూడా కరోనా పాజిటివ్ వచ్చిందని జాతీయ మీడియా పేర్కొంది. Read Also: ఆ ఒక్క పరుగు తీయనందుకు.. న్యూజిలాండ్ ఆటగాడికి…
లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ కరోనా బారిన పడి స్వల్పంగా కోలుకున్నారు. కానీ ఇంకా ఆమె ఐసీయూలోనే ఉన్నారు. ఆమెకు వెంటిలేటర్ తొలగించేందుకు వైద్యులు ప్రయత్నిస్తున్నారు. వెంటిలేటర్ లేకుండా ఆమె ఆరోగ్య పరిస్థితిని అంచనా వేసేందుకు ఈ ఉదయం కొంచెం సేపు వైద్యులు వెంటిలేటర్ తొలగించారు. దీంతో లతా మంగేష్కర్ కోలుకుంటున్న సూచనలు కనిపిస్తున్నాయని ఆమె కుటుంబ సభ్యులు వెల్లడించారు. లతా మంగేష్కర్ ఆరోగ్య పరిస్థితిని అనుక్షణం వైద్యులు గమనిస్తున్నారని పేర్కొన్నారు. Read Also: మెగాస్టార్ చిరంజీవికి…
కరోనా మహమ్మారి ఇప్పటికే దేశంలో లక్షలాది మందిని బలి తీసుకుంటోంది. కరోనా ధాటికి సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ అనారోగ్యం పాలవుతున్నారు. ఈ నేపథ్యంలో తనకు కోవిడ్ పాజిటివ్ వచ్చిందన్న మానసిక వేదనతో హైదరాబాద్ నగరంలో ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్యకు పాల్పడింది. Read Also: యువకుడికి సైబర్ నేరగాళ్ళ షాక్.. ఏం జరిగిందంటే? వివరాల్లోకి వెళ్తే… భద్రాచలానికి చెందిన డి.అలేఖ్య (28) హైదరాబాద్ నగరంలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగినిగా పనిచేస్తోంది. అల్వాల్ కానాజీగూడలోని మానస సరోవర్ హైట్స్‌లో…
భారత్‌లో కరోనా థర్డ్ వేవ్ పంజా విసురుతోంది.. రోజుకో రికార్డు తరహాలో కొత్త కేసులు వెలుగు చూస్తూనే ఉన్నాయి.. ఇప్పటికే పలువురు కేంద్ర మంత్రులు, రాజకీయ ప్రముఖులు, సినీ ప్రముఖులు, ఉన్నతాధికారులు మహమ్మారి బారిన పడిన విషయం తెలిసిందే కాగా.. తాజాగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి కరోనా పాజిటివ్‌గా తేలింది.. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా కిషన్ రెడ్డే స్వయంగా వెల్లడించారు.. తనకు కోవిడ్ పాజిటివ్‌గా వచ్చింది.. స్వల్ప లక్షణాలు ఉన్నాయన్న ఆయన.. వైద్యుల సూచనల…
వెస్టిండీస్‌లో అండర్-19 ప్రపంచకప్ కోసం పర్యటిస్తున్న భారత జట్టులో కరోనా కలకలం రేగింది. టీమిండియా కెప్టెన్ యశ్ ధుల్‌తో పాటు వైస్ కెప్టెన్ షేక్ రషీద్ కరోనా బారిన పడ్డారు. వీరితో క్లోజ్ కాంటాక్టులో ఉన్న బౌలర్ ఆరాధ్య యాదవ్‌తో పాటు వసు వత్స్, మానవ్ ప్రకాశ్, సిద్ధార్థ్ యాదవ్‌లకు కూడా కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో వీరంతా వరల్డ్ కప్ నుంచి వారు నిష్ర్కమించారు. ఐదుగురు ఆటగాళ్లు కరోనా బారిన పడటంతో ప్రస్తుతం భారతజట్టుకు 11…
టీడీపీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్షనాయకుడు చంద్రబాబు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. అయితే చంద్రబాబుకు కరోనా సోకడంపై ఏపీ సీఎం జగన్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. కరోనా నుంచి చంద్రబాబు వేగంగా కోలుకోవాలని… ఆయన ఆరోగ్యవంతులుగా తిరిగి రావాలని కోరుకుంటున్నట్లు వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. కాగా తనకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు చంద్రబాబు స్వయంగా మంగళవారం ఉదయం సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. తనను కలిసిన వారందరూ కరోనా టెస్టులు చేయించుకోవాలని…
ఎన్టీఆర్ 26వ వర్థంతి నాడు టీడీపీ అధినేత చంద్రబాబు కరోనా బారిన పడ్డారు. ఈ నేపథ్యంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ వర్థంతి రోజే చంద్రబాబుకు కరోనా సోకడం యాధృచ్ఛికమని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. చంద్రబాబుకు కరోనా సోకడం బాధాకరమని.. ఆయనకు వచ్చిన కరోనా తగ్గిపోతుందేమో కానీ… ఆనాడు ఎన్టీఆర్‌కు బాబు పొడిచిన వెన్నుపోటు తెలుగుజాతి ఉన్నంత వరకు గుర్తుంటుందని విజయసాయిరెడ్డి వ్యంగ్యంగా తన ట్వీట్‌లో పేర్కొన్నారు. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ…
తెలుగు దేశం పార్టీకి కరోనా టెన్షన్ పట్టుకుంది. ఆ పార్టీలో సీనియర్ నేతలు వరుసగా కరోనా బారిన పడుతున్నారు. ముందుగా టీడీపీ అధినేత తనయుడు నారా లోకేష్‌కు కరోనా పాజిటివ్ నిర్ధారణ కాగా… ఒక్కరోజు తేడాలో టీడీపీ అధినేత చంద్రబాబు కూడా కరోనా వలలో చిక్కుకున్నారు. అంతకుముందు కూడా పలువురు టీడీపీ నేతలు కరోనా బారిన పడ్డా… ఇప్పుడు వరుసగా సీనియర్ నేతలకు కరోనా సోకడం ఆ పార్టీలో కలకలం రేపుతోంది. తాజాగా టీడీపీ సీనియర్ నేత,…
ఏపీలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు కరోనా బారిన పడ్డారు. తనలో కరోనా లక్షణాలు కనిపించడంతో టెస్టులు చేయించుకున్న చంద్రబాబుకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని చంద్రబాబు స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం తాను సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉన్నట్లు ఆయన తెలిపారు. వైద్యుల సూచన మేరకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఇటీవల తనను కలిసినవారందరూ కరోనా టెస్టులు చేయించుకోవాలని చంద్రబాబు సూచించారు. Read Also:…