కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా కిందికి దిగి వస్తుండడంతో… కర్ఫ్యూ వేళల్లో మార్పులు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఉభయ గోదావరి జిల్లాలు మినహా మిగిలిన 11 జిల్లాల్లో రాత్రి 10 గంటల నుంచి మర్నాడు ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉండనుంది… ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు అన్ని రకాల కార్యకలాపాలు యథావిథిగా నిర్వహించుకోవచ్చని ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ సర్కార్.. కోవిడ్ నిబంధనలు…
కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించి నందుకు 1989 మంది పై ఎఫ్ఐఆర్ లు నమోదయ్యాయి అని విశాఖ సిటీ పోలీస్ కమిషనర్ మనీష్ కుమార్ సిన్హా తెలిపారు. ఇక మాస్కులు లేకుండా బయట తిరిగే 4,400 మందిపై వంద రూపాయిలు చొప్పున ఫైన్లు వేసాము. అలాగే 27 మార్చ్ నుండి 5 మే వరకు 15,000 మందిపై రూ.5వందల రూపాయలు చొప్పున ఫైన్ వేసాము. మే5 నుండి ఇప్పటి వరకు 70వేల మంది పై ఫైన్ లు వేసాము…
ఏపీలో కరోనా కేసులు భారీగా నమోదవుతుండటంతో ప్రభుత్వం కర్ఫ్యూ విధించింది. ఆ కర్ఫ్యూ కారణంగా కేసులు తగ్గుముఖం పట్టడంతో దానిని కొనసాగిస్తూ వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం మరోసారి కర్ఫ్యూను పొడిగించింది. ఈరోజు సీఎం వైఎస్ జగన్ కోవిడ్ పై నిర్వహించిన సమీక్షలో… స్వల్ప మార్పులు చేస్తూ జూన్ 20 వరకు కర్ఫ్యూను పొడిగించారు. అయితే జూన్10 తర్వాత ఉదయం 6 గంటలనుంచి మధ్యాహ్నం 2 గంటవరకూ కర్ఫ్యూ సమయంలో సడలింపు చేసారు. ఇక ప్రభుత్వ కార్యాలయాల పనిదినాల్లో…
కరోనా సెకండ్ వేవ్ కారణంగా జమ్మూ కాశ్మీర్ లో కర్ఫ్యూ విధించిన విషయం తెలిసిందే. కాగా ఈ నెల 24తో కరోనా నియంత్రణలు ముగియనుండటంతో మహమ్మారి కట్టడికి కర్ఫ్యూను నెలాఖరు వరకూ పొడిగించాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. కర్ఫ్యూను మే 31 వరకూ పొడిగించినట్టు జమ్ము కశ్మీర్ అధికార యంత్రాంగం శనివారం వెల్లడించింది. కర్ఫ్యూ నుంచి నిత్యావసర వస్తువులు, అత్యవసర సేవలకు మినహాయింపు ఇచ్చారు.