దేశంలో కరోనా మహమ్మారి కోరలు చాస్తోంది. సెకండ్ వేవ్ దెబ్బకు ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. రోజూ లక్షల కేసులు నమోదవుతున్నాయి. జాగ్రత్తలు తీసుకుంటున్నా, మహమ్మారి ఏ మాత్రం తగ్గడం లేదు. పైగా కరోనా దెబ్బకు కుటుంబాలు విచ్చిన్నం అవుతున్నాయి. ఒక ఇంట్లో ఒకరికి కరోనా సోకితే ఆ ప్రభావం మొత్తం ఇంటిపై పడుతున్నది. తాజాగా మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లిలో ఓ భర్తకు కరోనా సోకింది. ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతున్నాడు. అయితే, భర్త కరోనా నుంచి కోలుకోడేమో అనే సందేహంతో అయన భార్య ఆత్మహత్య చేసుకుంది. భర్త కరోనాతో ఆసుపత్రిలో ఉండటం, భార్య ఆత్మహత్య చేసుకోవడంతో బెల్లంపల్లిలో విషాదం నెలకొన్నది.