తెలంగాణలో కరోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. కేసులు భారీ స్థాయిలో నమోదవుతున్న నేపథ్యంలో ఆంక్షలను కఠినం చేస్తున్నారు. హైదరాబాద్ నగరంలో మాస్క్ ను తప్పనిసరి చేశారు. మాస్క్ లేకుండా బయట కనిపిస్తే భారీ జరిమానా విధిస్తున్నారు. ఇక ఇదిలా ఉంటె తాజాగా రాష్ట్ర ప్రభుత్వం కరోనా బులెటిన్ ను రిలీజ్ చేసింది. ఈ బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో కొత్తగా 3307 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,38,045కి చేరింది. ఇందులో 3,08,396 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. కరోనాతో కొత్తగా రాష్ట్రంలో 8 మంది మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా మృతుల సంఖ్య 1788కి చేరింది.