హరిద్వార్ లో ప్రస్తుతం కుంభమేళా జరుగుతున్నది. ప్రపంచంలోనే అత్యంత పెద్ద వేడుకల్లో కుంభమేళా కూడా ఒకటి. ఇలాంటి వేడుకలకు కోట్లాది మంది భక్తులు హాజరవుతుంటారు. నాలుగు నెలలపాటు ఈ వేడుక జరగాల్సి ఉన్నా, కరోనా కారణంగా నెలకు కుదించారు. కరోనా నిబంధనలు పాటిస్తూ కుంభమేళాను నిర్వహిస్తున్నారు. అయితే, కుంభమేళలో శాహిస్నాన్ ముఖ్యమైనది. ఈ శాహి స్నాన్ వేడుకలో లక్షలాది మంది సాధువులు పాల్గొంటారు. బుధవారం రోజున జరిగిన ఈ రాజస్నానం వేడుకలో సుమారుగా 13.5 లక్షల మంది సాధువులు, నాగా సాధువులు పాల్గొన్నారని అధికారులు చెప్తున్నారు. అయితే, లక్షలాది మంది హరిద్వార్ లోని గంగానదిలో స్నానం చేసేందుకు రావడంతో కరోనా నిబంధనలు గాలికి పోయాయి. ఎక్కడా మాస్క్, సోషల్ డిస్టెన్స్ కనిపించలేదు. దీంతో హరిద్వార్ లో ఇప్పుడు కరోనా టెన్షన్ పట్టుకుంది. ఎక్కడ కరోనా వ్యాపిస్తుందో అని భయపడిపోతున్నారు.